ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mount Etna Eruption: ఎగిసిపడిన అగ్నిపర్వతం.. భయాందోళనతో పర్యాటకుల పరుగు..

ABN, Publish Date - Jun 02 , 2025 | 06:42 PM

సిసిలీ ద్వీపంలోని ఓ పర్వత ప్రాంతానికి పర్యాటకులు చేరుకుని సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో అక్కడున్న అగ్ని పర్వతం (Mount Etna Eruption) ఒక్కసారిగా బద్ధలైంది. దీంతో అక్కడున్న టూరిస్టులు పరుగులు తీశారు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Mount Etna Eruption

ఇటలీ: సిసిలీ ద్వీపంలో ప్రశాంతంగా ఉన్న మౌంట్ ఎట్నా(Mount Etna Eruption) అగ్నిపర్వతం హఠాత్తుగా ఎగిసిపడింది. దీంతో ఆ ప్రాంతానికి చేరుకున్న టూరిస్టులు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఆ క్రమంలో అందుకు సంబంధించిన దృశ్యాలను పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. వీడియోలో అగ్నిపర్వతం నుంచి పెద్దఎత్తున పొగలు ఆకాశం వైపు దూసుకెళ్లడం చూడవచ్చు.


ఆ క్రమంలో అనేక మంది పర్యాటకులు ఆ పర్వత సమీపం నుంచి పరుగులు తీస్తున్నట్లు కనిపించారు. వారిలో భయం కనిపించింది. ఎందుకంటే లావా ప్రవాహం వారి వైపు వస్తున్నట్లు కనిపించింది. అదే సమయంలో కొంత మంది టూరిస్టులు మాత్రం దూరం నుంచి ఆ దృశ్యాలను వారి ఫోన్లలో బంధించారు.


ఎందుకు విరుచుకుపడింది..

ఈరోజు(సోమవారం) ఉదయం సౌత్ ఈస్ట్ క్రేటర్ (Southeast Crater) ప్రాంతంలోని ఓ భాగం కూలిపోయి మాగ్మాతో కలిసిపోయింది. దీంతో శక్తివంతమైన స్ట్రాంబోలియన్‎ పేలుళ్లు జరిగి, లావా ఫౌంటెయిన్ ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా సల్ఫర్ డయాక్సైడ్ వంటి విషపదార్థాలు ఆకాశంలోకి విడుదలయ్యాయన్నారు. ఇటలీ జియోఫిజిక్స్ వల్కనాలజీ సంస్థ (INGV) ప్రకారం ఇది స్ట్రాంబోలియన్ పేలుళ్ల రూపంలో జరిగిందని, ఇది తక్కువ శక్తితో కూడిన పేలుళ్లను సూచిస్తుందన్నారు. కాగా, ఈ ఘటన వల్ల స్థానిక ప్రజలకు మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదు.


Mount Etna గురించి..

Mount Etna 3,403 మీటర్ల ఎత్తుతో యూరోప్‌లోని అత్యంత ఎత్తైన అగ్నిపర్వతంగా ఉంది. ఇది సిసిలీ ద్వీపంలోని కాటానియా నగరానికి సమీపంలో కలదు. ఈ పర్వతం గతంలోనూ బద్ధలైంది. అయితే, ఈసారి విరుచుకుపడటం మరింత శక్తిమంతంగా జరిగింది. అగ్నిపర్వత పేలుడు ప్రకృతిలోని శక్తిని, అందాన్ని చూపిస్తోందని పలువురు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వాటి పట్ల పర్యాటకులు, స్థానికులు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించారు.


ఇవీ చదవండి:

ప్రజల వద్ద ఉన్న రూ.2000 నోట్లను తిరిగి తీసుకుంటాం..

జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 02 , 2025 | 07:22 PM