Pakistan Vs Afghanistan: ఆఫ్ఘానిస్థాన్‌తో వైరం.. పాక్‌లో పరిస్థితులు దారుణం
ABN, Publish Date - Oct 21 , 2025 | 01:12 PM
కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. కిలో టమాటో ధర రూ. 700 చేరింది. దీంతో ఈ కూరగాయాలను కొనుగోలు చేయలేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఇస్లామాబాద్, అక్టోబర్ 21: ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనే ఆరోపణలను ఎదుర్కొంటున్న దేశం పాకిస్థాన్. అలాంటి పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఇరుగు పొరుగు దేశాలు భారత్, ఆఫ్ఘానిస్థాన్‌తో పాక్ నిత్యం ఘర్షణలకు దిగుతుంది. అలాంటి పాకిస్థాన్‌లో ప్రస్తుతం కూరగాయాల ధరలు ఆకాశాన్నంటాయి. ఆ క్రమంలో కిలో టమాటో ధర మంగళవారం రూ. 700కు చేరింది. కొన్ని వారాల కిందటి వరకు కిలో టమాటో ధర రూ.100గా ఉండేది. కానీ మంగళవారం ఆ ధర కాస్తా కొండెక్కి కూర్చొంది. కిలో టమాటో ధర భారీగా పెరగడంతో.. వీటిని కొనుగోలు చేసేందుకు పాకిస్థానీయులు జంకుతున్నారు.
అయితే దేశంలోని దాదాపుగా అన్ని ప్రధాన నగరాల్లోని ధర ఇదే విధంగానే ఉంది. దీంతో టమాటోను కొనుగోలు చేయలేక.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక టమాటో ధర ఈ స్థాయికి చేరడానికి స్థానిక అంశాలతోపాటు పొరుగునున్న ఆఫ్ఘానిస్థాన్‌తో ఏర్పడిన వాణిజ్య విభేదాలే కారణమని ఒక చర్చ అయితే కొనసాగుతోంది.
మరోవైపు భారీ వర్షాలు, వరదలు, ఆప్ఘానిస్థాన్‌తో దెబ్బతిన్న వాణిజ్యం, దిగుమతులతో కొరత కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని పాకిస్థాన్‌కు చెందిన మీడియా విశ్లేషించింది. అదీకాక సరిహద్దు కారణంగా ఆఫ్ఘానిస్థాన్‌తో ఏర్పడిన వివాదం కూడా అందులో ఒక్కటని స్పష్టం చేసింది. టమాటోతోపాటు ఇతర కూరగాయల ధరలు సైతం ఆకాశాన్నంటాయని వివరించింది. ఆప్ఘానిస్థాన్‌తో వాణిజ్య మార్గాలను మూసివేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందంటూ క్వెట్టా, పెషావర్‌లోని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్న భారత్: ప్రధాని మోదీ
కేంద్రంపై మండిపడ్డ మావోయిస్టులు.. మరో సంచలన నిర్ణయం
For More International News And Telugu News
Updated Date - Oct 21 , 2025 | 01:47 PM