Diwali Celebrations: అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్న భారత్: ప్రధాని మోదీ
ABN , Publish Date - Oct 21 , 2025 | 12:16 PM
దీపావళి వేడుకల వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశించి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: భారతదేశం.. ఆపరేషన్ సిందూర్ ద్వారా ధర్మాన్ని పాటించడమే కాకుండా ప్రతీకారం సైతం తీర్చుకుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. శక్తి, ఉత్సాహం నిండిన ఈ పండగ వేళ.. దేశ పౌరులందరికి ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం దేశ పౌరులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. ఆయోధ్యలో రామాలయం నిర్మించిన తర్వాత జరుగుతున్న రెండో దీపావళి వేడుకలు ఇవి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ధర్మాన్ని నిలబెట్టాలని శ్రీరాముడు మనకు బోధించారని.. అలాగే అన్యాయాన్ని ఎదరించడానికి ధైర్యాన్ని సైతం ఇచ్చారని చెప్పారు. అందుకు ఈ ఏడాది మేలో జరిగిన ఆపరేషన్ సిందూరు ద్వారా ఇది నిరూపితమైందని ప్రధాని మోదీ వివరించారు.
అదీకాక ఈ దీపావళి వేళ దేశంలోని మారుమూల జిల్లాల్లో సైతం దీపాలు వెలిగించి పండగ చేసుకున్నారని పేర్కొన్నారు. దేశంలో నక్సలిజం, మావోయిస్టులను దాదాపుగా నిర్మూలించామని.. అందువల్లే ఇది సాధ్యమైందని వివరించారు. చాలా మంది మాజీ తీవ్రవాదులు జనజీవన స్రవంతిలో కలిసి.. రాజ్యాంగంపై నమ్మకంతో అభివృద్ధికి దోహదపడుతున్నారని చెప్పారు.
దసరా నవరాత్రులు ప్రారంభ వేళ.. జీఎస్టీ ధరలను భారీగా తగ్గించామన్నారు. ఇదంతా భవిష్యత్తు తరం కోసం సంస్కరణలలో భాగంగా వీటిని చేపట్టామన్నారు. ఈ సంస్కరణల కారణంగా దేశంలోని పౌరులకు రూ. వేల కోట్లు ఆదా చేయడానికి దోహదపడుతుందని తెలిపారు. అంతే కాకుండా ఈ నిర్ణయం జీవితాన్ని సులభతరం చేయడంతోపాటు ఆర్థిక వృద్ధిని పెంచుతుందన్నారు.
ఒక భారత్, ఉత్తమ భారత్ స్ఫూర్తిని నిలబెట్టడం కోసం స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. అన్ని భాషల పట్ల గౌరవం పెంపొందించుకోవాలని సూచించారు. అలాగే ఆరోగ్యంపై అవగాహన సైతం కల్పించుకోవాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళా సాధికారత, రక్షణకు సీఎం ప్రాధాన్యం: మంత్రి అనిత
కేంద్రంపై మండిపడ్డ మావోయిస్టులు.. మరో సంచలన నిర్ణయం
For More National News And Telugu News
చమురు వినియోగాన్ని దాదాపు 10 శాతం తగ్గించాలని.. మెరుగైన ఆరోగ్యం కోసం యోగా చేయాలని ప్రజలకు ఆయన సూచించారు. ఇక దీపావళికి సరికొత్త అర్థాన్ని ప్రధాని మోదీ తెలిపారు. ఒక దీపం మరో దీపం వెలిగించినప్పుడు.. కాంతి మరింత బలంగా పెరుగుతుందన్నారు. ఈ దీపావళి పండగ సందర్భంగా సమాజంలో సామరస్యం, సహకారంతోపాటు సానుకూలతను విస్తరింప చేయాలని ప్రజలను ప్రధాని మోదీ కోరారు.