Police Commemoration Day: మహిళా సాధికారత, రక్షణకు సీఎం ప్రాధాన్యం: మంత్రి అనిత
ABN , Publish Date - Oct 21 , 2025 | 09:42 AM
పోలీసుల అమరవీరుల దినోత్సవం నేడు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరులకు హోమ్ మంత్రి అనిత ఘనంగా నివాళులర్పించారు.
అమరావతి, అక్టోబర్ 21: మహిళా సాధికారత, రక్షణ కోసం సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అందులో భాగంగా శక్తి యాప్‌ను తీసుకు వచ్చామన్నారు. అక్టోబర్ 21వ తేదీ మంగళవారం పోలీసుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ అమర వీరులకు హోం మంత్రి అనిత ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ సమర్థవంతంగా పని చేస్తుందన్నారు. ఆపరేషన్ సేఫ్ పేరిట విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు.
సైబర్ స్టేషన్ల ఏర్పాటు.. సీసీ కెమెరాలు, డ్రోన్లు సైతం ఏర్పాటు చేశామని వివరించారు. రాష్ట్ర ప్రజల భద్రత కోసం సీఎం చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యలపై హోమ్ మంత్రి అనిత ప్రశంసలు కురిపించారు. అంతకు ముందు పోలీస్ అమరవీరులకు సీఎం చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతోపాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నిలిచిపోయిన వెబ్‌సైట్లు, యాప్స్.. ఎందుకంటే..
కేంద్రంపై మండిపడ్డ మావోయిస్టులు.. మరో సంచలన నిర్ణయం
For More AP News And Telugu News