Share News

Amazon Web Services down: నిలిచిపోయిన వెబ్‌సైట్లు, యాప్స్..ఎందుకంటే..

ABN , Publish Date - Oct 21 , 2025 | 07:41 AM

అమెజాన్ వెబ్ సర్వీసెస్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సేవలపై ఆధారపడిన వెబ్‌సైట్లు, యాప్ సేవలు నిలిచిపోయాయి. దీంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

Amazon Web Services down: నిలిచిపోయిన వెబ్‌సైట్లు, యాప్స్..ఎందుకంటే..

వాషింగ్టన్: అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సేవలపై ఆధారపడిన వెబ్‌సైట్లు, యాప్ సేవలు నిలిచిపోయాయి. ఆ జాబితాలో స్నాప్ చాట్, జూమ్, డ్యులింగో, కాన్వా, సిగ్నల్, వర్డ్‌లీ పోకేమాన్ గో వంటి యాప్స్, గేమ్స్ ఉన్నాయి. అలాగే బ్యాంకింగ్ సేవల్లో సైతం అంతరాయం ఏర్పడింది. దాంతో సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి.


సోమవారం మధ్యాహ్నం నుంచి అమెజాన్ వెబ్ సర్వీసుల్లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో అమెరికాలోని తూర్పు ప్రాంతం నుంచి అధికంగా ఫిర్యాదులు అందుతున్నాయి. యాప్ విభాగం నుంచి అత్యధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. సాంకేతికంగా ఏర్పడిన ఈ అంతరాయంపై అమెజాన్ ఇంజినీర్లు బృందం పని చేస్తోంది. సాంకేతిక సేవల్లో ఏర్పడిన అంతరాయం కారణంగా.. అమెజాన్‌కు చెందిన సేవలూ నిలిచిపోయాయి.


ఏడబ్ల్యూఎస్ అంటే.. అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఇది ప్రముఖ ఇ - కామర్స్ సంస్థ. అమెజాన్‌కు చెందిన అతిపెద్ద క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫారమ్. వెబ్‌సైట్లు, యాప్‌లతోపాటు తమ సర్వర్, స్టోరేజ్, డేటాబేస్ వంటి సేవల కోసం దీనిపై ఆధారపడుతున్నాయి. 2006లో అమెజాన్ ఈ సేవలను ప్రారంభించింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్‌గా ఇది ఉంది.

Updated Date - Oct 21 , 2025 | 08:14 AM