ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Actress Imani Dia: ప్రియుడి చేతిలో హత్యకు గురైన ప్రముఖ నటి

ABN, Publish Date - Dec 25 , 2025 | 03:12 PM

సెంబర్ 21వ తేదీన అమెరికా, ఎడిసన్‌లోని ఇంట్లో ఇమానీ దియా స్మిత్ హత్యకు గురయ్యారు. ఇమానీని హత్య చేశాడంటూ పోలీసులు ఇమానీ ప్రియుడు జోర్డాన్ డీ జాక్సన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Actress Imani Dia

హాలీవుడ్ నటి ఇమానీ దియా స్మిత్ చనిపోయారు. 25 ఏళ్ల వయసులో ఆమె తన ప్రియుడి చేతిలో దారుణంగా హత్యకు గురయ్యారు. సంఘటనకు సంబంధించి డిసెంబర్ 23వ తేదీన మిడిల్‌సెక్స్ కౌంటీ ప్రాసిక్యూటర్స్ ఆఫీస్ తెలిపిన వివరాల మేరకు.. డిసెంబర్ 21వ తేదీన అమెరికా, ఎడిసన్‌లోని ఇంట్లో ఇమానీ దియా స్మిత్ తీవ్ర కత్తి పోట్లతో కనిపించారు. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. డాక్టర్లు ఆమె అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఇమానీని హత్య చేశాడంటూ పోలీసులు ఇమానీ ప్రియుడు జోర్డాన్ డీ జాక్సన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఫస్ట్ డిగ్రీ మర్డర్ కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. ఇమానీ బ్రాడ్‌‌వే చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ది లయన్ కింగ్‌లో నటించారు. ఆమె ఎడిసన్‌లోని ఇంట్లో మూడు సంవత్సరాల కొడుకు, తల్లిదండ్రులు, తోబుట్టువులతో కలిసి ఉంటున్నారు. ఇమానీ అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా కుటుంబసభ్యుల దగ్గర డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇమానీ ఆంటీ ‘గోఫండ్‌మీ’లో ఓ క్యాంపైన్ నిర్వహిస్తోంది. ఇమానీ అంత్యక్రియలు నిర్వహించడానికి, ఆమె తల్లిదండ్రులకు థెరపీ చేయించడానికి, ఇమానీ కొడుకుతో పాటు పెంపుడు కుక్కను చూసుకోవడానికి డబ్బులు సాయం చేయమని వేడుకుంటోంది.

ఇక, ఇమానీ మృతిపై ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉన్నారు. ఎమోషనల్ పోస్టులు పెడుతూ ఉన్నారు. ‘మనసును కలిచి వేసే సంఘటన. నాకు ఎంతో ఇష్టమైన నటి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’..‘చాలా త్వరగా ఈ లోకాన్ని విడిచిపోయావు ఇమానీ. నీ ఆత్మకు శాంతి కలగాలి’ అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఆమె నటించిన లయన్ కింగ్ బ్రాడ్ వేను గుర్తు చేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

కుక్కలు ఎప్పుడూ బైక్‌లు, కార్ల వెంట ఎందుకు పరిగెడతాయి.. అసలు కారణమేంటి..

మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ ఫొటోలో చిలుక ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Dec 25 , 2025 | 03:17 PM