Afghan-Pak Clash: అఫ్ఘాన్, పాక్ దళాల పరస్పర దాడులు.. 12 మంది పాక్ సైనికుల మృతి
ABN, Publish Date - Oct 12 , 2025 | 07:40 AM
డ్యురాండ్ సరిహద్దు వెంబడి పాక్, అప్ఘాన్ దళాలు పరస్పర దాడులు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో సుమారు 12 మంది పాక్ సైనికులు మరణించినట్టు సమాచారం. కాబుల్‌పై పాక్ వైమానిక దాడులకు తాము బదులిచ్చినట్టు అప్ఘాన్ రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: డ్యురాండ్ సరిహద్దు వెంబడి పాక్, అఫ్ఘాన్ సైనిక దళాలు ఘర్షణకు దిగాయి. తాలిబాన్ దళాల దాడుల్లో ఏకంగా 12 మంది సైనికులు మృతి చెందారు. కునార్, హెల్మాండ్ ప్రావిన్సులకు సమీపంలో సరిహద్దు వెంబడి పలు పాక్ స్థావరాలను స్వాధీనం చేసుకున్నామని అఫ్ఘాన్ రక్షణ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. బహ్రమ్చా, షాక్జీ, బీబీజానీ, సలేహాన్ జిల్లాలో పాక్, అఫ్ఘాన్ దళాలను ఎదురుకాల్పులకు దిగాయి (Pak Afghan Forces Clash).
అకారణంగా కాల్పులకు జరిపిన అఫ్ఘాన్ దళాలను దీటుగా తిప్పికొడుతున్నామని పాక్ భద్రతా అధికారులు తెలిపారు. తమ గగతలాన్ని పాక్ ఉల్లంఘించినందుకు ప్రతీకారంగా తాము ఈ దాడులు చేసినట్టు అఫ్ఘాన్ రక్షణ శాఖ ప్రతినిధి ఇనాయతుల్లా ఖొవరాజ్మీ తెలిపారు. ప్రస్తుతానికి దాడులు ముగిశాయని చెప్పారు. పాక్ ఆయుధ సామగ్రిని, నిర్మాణాలను ధ్వంసం చేశామని తెలిపారు. పాక్ దళాలు దెబ్బతిన్నాయి, వారి వాహనాలను, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మరోసారి పాక్ తమ గగన తలాన్ని ఉల్లంఘిస్తే తమ సాయుధ దళాలు దీటుగా బదులిస్తాయని హెచ్చరించారు.
అఫ్ఘాన్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరు దేశాలు సమన్వయం పాటించాలని ఖతర్ పిలుపునిచ్చింది. సమస్యలను చర్చలతో పరిష్కరించుకోవాలని సూచించింది. కొన్ని రోజుల క్రితం కాబుల్‌లోని టీటీపీ ఉగ్రవాదులను టార్గెట్ చేస్తూ పాక్ గగనతల దాడులు చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
మా పాత్ర ఏమీ లేదు.. అప్ఘాన్ ప్రెస్ మీట్‌పై కేంద్రం వివరణ
భారతీయ స్టూడెంట్ రాకపోతే మన భవిష్యత్తుకు ఇబ్బందే.. అమెరికా బిలియనీర్ హెచ్చరిక
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Oct 12 , 2025 | 08:32 AM