Russia-Ukraine Peace Talks: ఉక్రెయిన్‌తో చర్చలు నిలిచిపోయినట్టే.. ప్రకటించిన రష్యా
ABN, Publish Date - Sep 12 , 2025 | 08:30 PM
రష్యా తాజాగా సంచలన ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు బ్రేకులు పడ్డాయని తెలిపింది. శాంతిస్థాపనకు ఐరోపా దేశాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆరోపించింది. చర్చలకు ద్వారాలు మాత్రం ఇప్పటికీ తెరిచే ఉన్నాయని, శాంతిస్థాపనకు రష్యా ఎల్లప్పుడూ సిద్ధమేనని ప్రభుత్వ ప్రతినిధి పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఎలాగైనా ఆపుతానంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ తిగిలింది. ఉక్రెయిన్‌తో శాంతి స్థాపన చర్చలు ప్రస్తుతానికి నిలిచిపోయినట్టే అని రష్యా తాజాగా కీలక ప్రకటన చేసింది. చర్చలకు ఐరోపా దేశాల తీరు అడ్డంకిగా మారిందని ఆరోపించిన రష్యా.. తానైతే చర్చలకు ఇప్పటికీ సిద్ధమేనని పేర్కొంది. ఈ మేరకు రష్యా ప్రభుత్వ ప్రతినిధి మీడియాకు తెలిపారు. ‘చర్చలకు ద్వారాలన్నీ తెరిచే ఉన్నాయి. పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ఇరు వర్గాలు నిత్యం ఒకరికొకరు అందుబాటులో ఉండొచ్చు. అయితే, ప్రస్తుతానికి మాత్రం చర్చలు నిలిచిపోయినట్టే. శాంతి చర్చల కోసం రష్యా ఎప్పడూ సిద్ధంగానే ఉంటుంది. కానీ ఐరోపా వారు అడ్డంకులు సృష్టిస్తున్నారనేది వాస్తవం ’ అని రష్యా ప్రతినిధి పేర్కొన్నారు (Russia Ukraine peace talks paused).
ఇటీవలి షాంఘాయ్ సహకార సదస్సు సందర్భంగా పుతిన్.. ఉక్రెయిన్‌తో యుద్ధం గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. చర్చల ద్వారా యుద్ధాన్ని ముగించేందుకు ఇప్పటికీ అవకాశం ఉందని పుతిన్ పేర్కొన్నారు. కాస్త ఇంగిత జ్ఞానంతో ఆలోచించాలని సూచించారు. అయితే, అవసరమైతే ఆయుధ ప్రయోగంతో కూడా యుద్ధాన్ని ముగిస్తామని కూడా హెచ్చరించారు. శాంతిస్థాపన దిశగా తనకు ఆశావాహ సంకేతాలు కనిపిస్తున్నాయని, యుద్ధం ముగించేందుకు ట్రంప్ నిజాయితీగా కృషి చేస్తున్నారని కూడా కితాబునిచ్చారు (Russia blames Europe peace talks). మాస్కోలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశం అయ్యేందుకు కూడా తాను సిద్ధమేనని అన్నారు. ఈ నేపథ్యంలో చర్చలకు బ్రేకులు పడ్డట్టు రష్యా ప్రకటించడం సంచలనంగా మారింది.
ఇవి కూడా చదవండి:
కిర్క్ హత్య.. పోలీసుల కస్టడీలో అనుమానితుడు
సుచిర్ బాలాజీది హత్యే.. ఓపెన్‌ఏఐ సీఈఓకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఎలాన్ మస్క్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 12 , 2025 | 08:33 PM