ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Richest Hindu in Pakistan: పాకిస్తాన్‌లో అత్యంత ధనవంతుడైన హిందువు ఎవరు? ఆస్తులెంత, వ్యాపారమేంటి?

ABN, Publish Date - Oct 07 , 2025 | 05:24 PM

పాకిస్తాన్‌లో అత్యంత ధనవంతుడైన హిందువు ఎవరనేది అందరికీ ఆసక్తిని కలిగించే ప్రశ్న. అతని నికర ఆస్తుల విలువెంత, ఆయన చేస్తున్న వ్యాపారమేంటి? అనేవి కూడా ఆ పరంపరలో వచ్చే సందేహాలు..

Richest Hindu in Pakistan

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్తాన్‌లో అత్యంత ధనవంతుడైన హిందువు ఎవరనేది అందరికీ ఆసక్తిని కలిగించే ప్రశ్న. ముఖ్యంగా భారతీయుల్లో ఇది ఎక్కువగానే ఉండొచ్చు. అంతేకాదు, అతని నికర ఆస్తుల విలువ ఎంత, ఆయన చేస్తున్న వ్యాపారం ఏమిటి? అనేవి కూడా ఆ పరంపరలో వచ్చే సందేహాలు.

ఇక, పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ 2023 డేటా ప్రకారం, పాకిస్తాన్‌లో దాదాపు 5.2 మిలియన్ల మంది హిందువులు ఉన్నారు. దాదాపు 4.9 మిలియన్లు సింధ్ ప్రావిన్స్‌లో నివసిస్తున్నారు. పాకిస్థాన్ లో తరచూ వినిపించే పేదరికం, ఆకలి, ఉగ్రవాదం, మైనారిటీలపై దౌర్జన్యాలు అనేవి పక్కన పెట్టి, దేశంలో పురోగతి సాధించిన మైనారిటీ వ్యక్తుల గురించి చెప్పుకుంటే.. పాకిస్తాన్‌లో అత్యంత ధనవంతుడైన హిందువు దీపక్ పెర్వానీ. అతను 1974లో సింధ్‌లోని మీర్పూర్ ఖాస్‌లో జన్మించాడు. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరిగా పరిగణింపబడుతున్నారు. ఇతను నటుడు కూడా.

దీపక్ 1996లో ఫ్యాషన్ డిజైనర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. అతను పాకిస్తాన్‌లోనే కాకుండా అంతర్జాతీయంగా అనేక అవార్డులను అందుకున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద కుర్తా (సాంప్రదాయ చొక్కా)ను సృష్టించినందుకు ఆయన పేరు ప్రపంచ రికార్డు పుస్తకాల్లో నమోదైంది. ఆయన భారతీయ గీత రచయిత జావేద్ అక్తర్, ఆయన భార్య.. నటి షబానా అజ్మీ వంటి అనేక మంది అంతర్జాతీయ ప్రముఖులతో కలిసి పనిచేశారు. దీపక్ పెర్వానీ తన ఫ్యాషన్ ద్వారా పాకిస్తాన్ సంస్కృతిని ప్రపంచ వేదికలకు తీసుకెళ్లడంలో ప్రసిద్ధి చెందారు.

2022 నాటికి, మీడియా నివేదికల ప్రకారం దీపక్ పెర్వానీ మొత్తం నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 71 కోట్లు (సుమారు $8.5 మిలియన్లు)గా అంచనా. అతని బంధువు నవీన్ పెర్వానీ కూడా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. అంతర్జాతీయ స్నూకర్ ఆటగాడు. అతను దాదాపు రూ. 60 కోట్ల నికర ఆస్తులు కలిగి ఉన్నాడు. ఇద్దరూ పాకిస్తాన్‌లోని అత్యంత ధనవంతులైన హిందువుల జాబితాలో ఉన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 07 , 2025 | 05:29 PM