Pakistan Bomb Blast: పాక్‌లో శక్తివంతమైన బాంబు పేలుడు.. పదిమంది మృతి
ABN, Publish Date - Sep 30 , 2025 | 02:36 PM
బలోచిస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి భక్త్ మహమ్మద్ కాకర్ సిటీలోని అన్ని ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. కన్సల్టెంట్‌లు, డాక్టర్లు, ఫార్మసిస్టులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది తక్షణం డ్యూటీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. పేలుడుకు కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ (Pakistan)లోని క్వెట్టా (Quetta)లో మంగళవారంనాడు భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పదిమంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. క్వెట్టాలోని ఝార్గూన్ రోడ్డులో ఈ పేలుడు జరిగింది. ఆ వెంటనే కాల్పుల మోతలు వినిపించాయి. ఈ ఘటన అనంతరం సిటీలోని అన్ని ఆసుపత్రులలో ఎమర్జెన్సీ ప్రకటించారు.
బాంబు పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నట్టు పోలీసులు తెలిపారు. పదిమంది మృతిచెందగా, 19 మంది గాయపడినట్టు చెప్పారు. ఘటన అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. పోలీసులు, రెస్క్యూ టీమ్ హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
బలోచిస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి భక్త్ మహమ్మద్ కాకర్ సిటీలోని అన్ని ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. కన్సల్టెంట్‌లు, డాక్టర్లు, ఫార్మసిస్టులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది తక్షణం డ్యూటీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. పేలుడుకు కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.
ఆత్మాహుతి బాంబింగ్
ఇది ఆత్మాహుతి దాడి కావచ్చని పాకిస్థాన్ మీడియాలో కథనాలు వచ్చాయి. పేలుడు అనంతరం పెద్దఎత్తున పొగలు చుట్టుపక్కలకు వ్యాపించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సెప్టెంబర్ 4న కూడా క్వెట్వాలో ఒక పొలిటికల్ ర్యాలీ సందర్భంగా బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు.
ఇవి కూడా చదవండి..
లండన్‌లో మహాత్ముడి విగ్రహంపై పిచ్చి రాతలు.. జాత్యాహంకారుల దుశ్చర్య
విదేశీ సినిమాలపై 100శాతం టారిఫ్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 30 , 2025 | 05:50 PM