Share News

Donald Trump Announced Tariff: విదేశీ సినిమాలపై 100శాతం టారిఫ్

ABN , Publish Date - Sep 30 , 2025 | 04:10 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవార మరోసారి టారిఫ్‌ల కొరడా ఝుళిపించారు. ఈసారి విదేశీ సినిమాలపై సుంకాలను 100ు మేర పెంచారు..

Donald Trump Announced Tariff: విదేశీ సినిమాలపై 100శాతం టారిఫ్

  • ఫర్నిచర్‌పైనా సుంకాల పెంపు.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన ప్రకటన

  • భారత చిత్ర పరిశ్రమపై ప్రభావం

  • నెట్‌ఫ్లిక్స్‌ షేరు ధరలో 1.5% తగ్గుదల

వాషింగ్టన్‌, సెప్టెంబరు 29: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం మరోసారి టారిఫ్‌ల కొరడా ఝుళిపించారు. ఈసారి విదేశీ సినిమాలపై సుంకాలను 100ు మేర పెంచారు. విదేశీ ఫర్నిచర్‌పైనా సుంకాలను పెంచనున్నట్టు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలను తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. వినోద, తయారీ రంగాల ఉద్యోగాలను తిరిగి అమెరికాకు తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూత్‌ సోషల్‌లో పోస్టులు పెట్టారు. హాలీవుడ్‌పై దృష్టి సారించిన ఆయన విదేశీ పోటీదార్ల కారణంగా సినిమా పరిశ్రమపై అమెరికా ఆధిపత్యం తగ్గిందని అభిప్రాయపడ్డారు. ‘‘మన సినీ నిర్మాణ వ్యాపారాన్ని ఇతర దేశాలు దొంగిలించాయి. చిన్న పిల్లల చేతిలోని క్యాండీని లాక్కొన్నట్టు తీసుకెళ్లిపోయాయి. ముఖ్యంగా బలహీన, అసమర్థ గవర్నర్‌ కారణంగా కాలిఫోర్నియా నష్టపోయింది. చిరకాలంగా, ముగింపంటూ లేకుండా సాగుతున్న ఈ సమస్యను పరిష్కరించడానికి అమెరికా బయట నిర్మించిన అన్ని సినిమాలపై 100ుటారిఫ్‌ విధించాలని ప్రతిపాదిస్తున్నా’’ అని పేర్కొన్నారు. తర్వాత మరో పోస్టు పెడుతూ ఒకప్పుడు ఫర్నిచర్‌ తయారీ రంగంలో ఒక వెలుగువెలిగిన నార్త్‌ కరోలినా రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చేందుకు విదేశీ ఫర్నిచర్‌పై టారి్‌ఫలు పెంచుతామని తెలిపారు. ‘‘చైనా, ఇతర దేశాల కారణంగా నార్త్‌ కరోలినా ఫర్నిచర్‌ వ్యాపారాన్ని పూర్తిగా కోల్పోయింది. ఆ రాష్ట్రాన్ని మళ్లీ ‘గ్రేట్‌’గా మార్చేందుకు అమెరికాలో తయారుచేయని ఫర్నిచర్‌పై టారి్‌ఫలు పెంచుతాం’’ అని పేర్కొన్నారు. ట్రంప్‌ నిర్ణయం భారత సినీ పరిశ్రమపై భారీగా ప్రభావం చూపనుంది. ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం అమెరికా, కెనడాల్లో ఏ సమయంలో చూసినా 1,000కిపైగా భారత భాషల సినిమాలు ఆడుతుంటాయి. భారత దేశ నిర్మాతలు, అమెరికా డిస్ట్రిబ్యూటర్లు కలిసి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. అందువల్ల విదేశాల్లో నిర్మించిన సినిమాలపై 100ు టారిఫ్‌ విధించే చట్టబద్ధమైన అధికారం అధ్యక్షుడికి ఉందా అన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, నెట్‌ఫ్లిక్స్‌ షేరు ధర 1.5ు మేర తగ్గింది.

Updated Date - Sep 30 , 2025 | 06:02 AM