ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: మోదీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం

ABN, Publish Date - Jul 09 , 2025 | 08:06 PM

నమీబియా అత్యున్నత పౌర పురస్కారం 'వెల్‌విచ్చియా మిరాబిలి'తో అందుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఇందుకు గాను నమీబియా అధ్యక్షురాలు, ప్రభుత్వం, ప్రజలకు కృతజ్ఞతలని నరేంద్ర మోదీ అన్నారు.

విండ్‌హోక్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి మరో అరుదైన గౌరవం లభించింది. నమీబియా పర్యటనలో ఉన్న ఆయనకు ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్‌విచ్చియా మిరాబిలిస్'ను ప్రధానం చేశారు. నమీబియా అధ్యక్షురాలు డాక్టర్ నెటుంబో నంది-ఎన్ ద్వైతా (Dr Netumbo Nandi-Ndaitwah) ఈ అవార్డును మోదీకి అందజేశారు. నమీబియాతో పాటు ప్రపంచ శాంతి, న్యాయం, సామాజిక ఆర్థిక అభివృద్ధికి మోదీ చేసిన సేవలను అధ్యక్షురాలు ప్రశంసించారు.

నమీబియా అత్యున్నత పౌర పురస్కారం 'వెల్‌విచ్చియా మిరాబిలి'తో అందుకోవడం చాలా ఆనందంగా ఉందని మోదీ అన్నారు. నమీబియా అధ్యక్షురాలు, ప్రభుత్వం, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలోని 140 కోట్ల మంది భారతీయుల తరఫున ఈ పురస్కారాన్ని అందుకుంటున్నానని చెప్పారు. ఇండియా-నమిబియా మధ్య ఎప్పటికీ చెక్కుచెదరని చిరకాల స్నేహం ఉందని, ఈరోజు ఇక్కడ అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. తనకు ఇచ్చిన పురస్కారాన్ని నమీబియా, ఇండియా ప్రజలకు అంకితమిస్తున్నానని తెలిపారు. కష్టకాలంలో ఉన్నప్పుడు చేయూత నిచ్చినవారే నిజమైన మిత్రులని, స్వాతంత్ర్య పోరాటం సమయం నుంచి కూడా ఒకరికొకరు బాసటగా ఇండియా, నమీబియా నిలబడ్డాయని చెప్పారు. ఇరుదేశాల మైత్రి రాజకీయాల నుంచి పుట్టిన మైత్రి కాదని, పరస్పరం ఎదుర్కొన కష్టాలు, సహకారం, పరస్పరం విశ్వాసం నుంచి బలపడందని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇరుదేశాలు మైత్రీ సంబంధాలతో అభివృద్ధి పథం దిశగా పయనించనున్నాయని అన్నారు.

నరేంద్ర మోదీ 2014 మేలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి ఇంతవరకూ 26 అంతర్జాతీయ పురస్కారాలు అందుకోగా, నమీబియా పురస్కారం 27వది. ఐదు దేశాల పర్యటనల్లో భాగంగా చివరిగా నమీబియాలో మోదీ పర్యటిస్తున్నారు. నమీబియా అద్యక్షురాలితో ద్వైపాక్షిక సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఇంధన, హెల్త్‌కేర్ వంటి రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించిన ఇండియా-నమీబియా మధ్య నాలుగు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.

ఇవి కూడా చదవండి..

బ్రిక్స్‌ దేశాలపై 10% అదనపు సుంకం

జర్మనీ విమానంపై చైనా యుద్ధనౌక లేజర్‌

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 09 , 2025 | 08:13 PM