Pakistani Taliban Releases Video: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌కు తాలిబన్ల ఘాటు హెచ్చరిక..
ABN, Publish Date - Oct 23 , 2025 | 08:05 PM
టీటీపీ వరుస దాడులతో పాకిస్తాన్ అల్లాడిపోతోంది. అక్టోబర్ 8వ తేదీన ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కుర్రమ్‌లో టీటీపీ బాంబు దాడులు చేసింది. ఈ దాడుల్లో 22 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్లు టీటీపీ వెల్లడించింది.
తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) తీవ్రవాద సంస్థ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌ను టార్గెట్ చేసింది. టీటీపీ కమాండర్ కాజిమ్.. ఆసిమ్ మునీర్‌కు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో కాజిమ్ మాట్లాడుతూ.. ‘అల్లా మాకు ఆయుధాలను ఇచ్చాడు. ఈ యుద్ధం కొనసాగుతుంది. మీరు గనుక నిజంగా పురుషులు అయితే.. తల్లి పాలు తాగి ఉంటే సాధారణ సైనికులను పంపకండి.
గొర్రెలు, మేకలలాంటి వారిని పంపకండి. స్వయంగా మీరే రండి. అప్పుడు మీకు యుద్ధం రుచి ఎలా ఉంటుందో చూపిస్తాం. యుద్ధంలో ఎలా పోరాడాలో చూపిస్తాం’ అని అన్నాడు. కాగా, కాజిమ్ తలపై భారీ రివార్డు ఉంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రభుత్వం టీటీపీ కమాండర్ కాజిమ్‌పై 100 కోట్ల పాకిస్థానీ రూపాయల బౌంటీ ప్రకటించింది. పాకిస్థాన్ ఆర్మీ లెఫ్టెనెంట్, కల్నల్‌ను చంపాడని కాజిమ్‌పై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. కుర్రమ్ డిప్యూటీ కమిషనర్ జవేదుల్లా మెహ్‌షుద్‌ను చంపడానికి కుట్రలు చేశాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే అతడిపై ప్రభుత్వం పెద్ద మొత్తంలో బౌంటీ ప్రకటించింది. కాగా, టీటీపీ వరుస దాడులతో పాకిస్థాన్ అల్లాడిపోతోంది. అక్టోబర్ 8వ తేదీన ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కుర్రమ్‌లో టీటీపీ బాంబు దాడులు చేసింది. ఈ దాడుల్లో 22 మంది పాకిస్థాన్ సైనికులు చనిపోయినట్లు టీటీపీ వెల్లడించింది. అయితే, పాకిస్థాన్ ఆర్మీ 11 మంది మాత్రమే చనిపోయారని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
భారత రక్షణ కొనుగోళ్లకు రూ. 79,000 కోట్లు : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఢిల్లీలో వాయు కాలుష్యం.. పంజాబ్‌లో పెరుగుతున్న పంట వ్యర్థాల దగ్ధం కేసులు
Updated Date - Oct 23 , 2025 | 08:54 PM