India Defence: భారత రక్షణ కొనుగోళ్లకు రూ.79,000 కోట్లు: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ABN , Publish Date - Oct 23 , 2025 | 07:42 PM
భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రూ.79,000 కోట్ల విలువైన సైనిక పరికరాల కొనుగోళ్లకు అనుమతి ఇచ్చింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన..
న్యూఢిల్లీ, అక్టోబర్ 23: భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రూ.79,000 కోట్ల విలువైన సైనిక పరికరాల కొనుగోళ్లకు అనుమతి ఇచ్చింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన రక్షణ కొనుగోళ్ల మండలి (DAC) సమావేశంలో దీనికి సంబంధించిన AoN ఆమోదించారు. ఫలితంగా భారత సైన్యం, నావికాదళం, వాయుసేనల యుద్ధ సామర్థ్యాన్ని ఇది గణనీయంగా పెంచేందుకు తోడ్పడుతుంది.
ఈ చర్య కారణంగా భారత సైన్యానికి నాగ్ మిస్సైల్ వ్యవస్థ (Mk-II NAMIS), గ్రౌండ్-బేస్డ్ మొబైల్ ELINT సిస్టమ్‌లు (GBMES) అందుబాటులోకి వస్తాయి. NAMIS.. శత్రు యుద్ధ వాహనాలు, బంకర్ల వంటి, దుర్భేద్యమైన నిర్మాణాలను సైతం విధ్వంసం చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. అంతేకాదు, GBMES 24 గంటల ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్, టాక్టికల్ సమాచార సేకరణకూ ఈ నిధులు సహాయపడతాయి.
అలాగే, డైవర్స్ టెరైన్లలో లాజిస్టిక్స్ మద్దతును మెరుగుపరచడానికి హై-మొబిలిటీ వెహికల్స్ (క్రేన్‌లు) కూడా ఈ కొనుగోళ్ల జాబితాలో చేర్చారు. నావికాదళానికి ల్యాండింగ్ ప్లాట్‌ఫామ్ డాక్‌లు (LPD) 30 మి.మీ. నావల్ సర్ఫేస్ గన్‌ల కొనుగోళ్లకు సైతం ఆమోదం లభించింది. LPDలు సైన్యం, వాయుసేనతో కలిసి జాయింట్ అంఫిబియస్ అసాల్ట్ ఆపరేషన్లకు, శాంతి స్థాపన, మానవతా సహాయం, విపత్తు నివారణలకు ఇవి ఉపయోగపడతాయి.
ఇక, 30 మి.మీ. గన్‌లు తక్కువ తీవ్రత మెరైటైమ్, యాంటీ-పైరసీ ఆపరేషన్లకు సహాయపడతాయి. DRDO నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లాబ్ అభివృద్ధి చేసిన అడ్వాన్స్‌డ్ లైట్‌వెయిట్ టార్పెడోలు సంప్రదాయ, న్యూక్లియర్, మిడ్జెట్ సబ్‌మెరైన్‌లను కూడా అందుబాటులోకి తెచ్చుకోవచ్చు. మరోవైపు, 76 మి.మీ. సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్ కోసం స్మార్ట్ అమ్యూనిషన్, ఎలక్ట్రో-ఆప్టికల్ ఇన్‌ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాక్ సిస్టమ్ కూడా మన రక్షణ వ్యవస్థలోకి చేరతాయి.
అంతేకాదు, వాయుసేనకు కోలాబరేటివ్ లాంగ్ రేంజ్ టార్గెట్ సాచురేషన్/డిస్ట్రక్షన్ సిస్టమ్ (CLRTS/DS) అందుబాటులోకి వస్తుంది. ఇది స్వయంగా టేక్-ఆఫ్, ల్యాండింగ్, నావిగేషన్, డిటెక్షన్, పేలోడ్ డెలివరీ చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం, ఈ పరికరాలు సైనిక బలగాల ఆపరేషనల్ రెడీనెస్‌ను మెరుగుపరచడమే కాకుండా, మల్టీ-డొమైన్ జాయింట్ ఆపరేషన్లు, విపత్తు నివారణ, యాంటీ-పైరసీ వంటి విభిన్న మిషన్లకు సహాయపడతాయి. DRDO వంటి స్వదేశీ సంస్థల పాత్ర కీలకమై, ఆత్మనిర్భర్ భారత్‌కు బలం చేకూరుస్తుంది. ఈ రక్షణ రంగ కొనుగోళ్లు భారత రక్షణ వ్యవస్థ మరింత ఆధునికీకరణకు తోడ్పడతాయి.
ఇవి కూడా చదవండి:
Tejashwi Yadav: డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో రాష్ట్రంలో అవినీతి: తేజస్వి యాదవ్
MNM leader Snehan: అసెంబ్లీ ఎన్నికలు.. భీకర యుద్ధమే