Home » Defence Intelligence Agency
భారత రక్షణ దళాల ఆధునీకరణ కోసం, దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీకి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 1.10 లక్షల కోట్ల విలువైన రక్షణ పరికరాల కొనుగోలు ప్రతిపాదనలకు రక్షణ కొనుగోళ్ల మండలి ఆమోదం తెలిపింది.
'ఆపరేషన్ సిందూర్'లో సమర్థవంతంగా పనిచేసిన రష్యన్ ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థలకు భారత్ మరోసారి కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు 5 కొత్త వ్యవస్థలను భారత్‌కు విక్రయించేందుకు రష్యా అంగీకరించినట్టు సమాచారం.
భారత వైమానిక దళం కోసం మరో ఐదు S-400 'సుదర్శన్' యూనిట్ల కొనుగోలుకు సంబంధించి భారత్ జారీ చేసిన టెండర్‌కు రష్యా తన ప్రతిపాదనను సమర్పించింది. ఈ కొత్త ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.50,000 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.
భారత్-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన 'బ్రహ్మోస్' సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను తమ సొంత సాయుధ దళాలలో చేర్చుకోవడానికి రష్యా అమితాసక్తి కనబరుస్తోంది. అంతేకాదు, ఈ బ్రహ్మోస్ క్షిపణులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ కేకుల్లా మారాయి.
సింగపూర్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక 'షాంగ్రి-లా డైలాగ్' సదస్సు వేదికగా భారత్ తన రక్షణ దౌత్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఈ సదస్సు సందర్భంగా భారత రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్.. సింగపూర్, న్యూజిలాండ్ దేశాల రక్షణ శాఖ మంత్రులతో విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
గత కొన్నేళ్లుగా జరుగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం, గాజా యుద్ధం ప్రపంచ దేశాలకు నేర్పుతున్న పాఠాలు ఏంటి? ఈ యుద్ధాలలో సంపూర్ణ విజేతలు ఉండరు. ఈ యుద్ధాలు కొనసాగుతూనే ఉంటాయి. ఒక దేశ ఆర్థిక, పారిశ్రామిక శక్తికి సవాలు విసురుతాయి.
అదానీ గ్రూప్ భారత రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. మానవరహిత అటానమస్ వ్యవస్థలు.. ఏఐ ఆధారిత కార్యకలాపాలు, విమాన ఇంజిన్ల నిర్వహణ-మరమ్మతు-ఓవర్‌హాలింగ్..
భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రూ.79,000 కోట్ల విలువైన సైనిక పరికరాల కొనుగోళ్లకు అనుమతి ఇచ్చింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన..
రైఫిల్ సమర్థవంతమైన పరిధిని పూర్తిగా ఉపయోగించుకునేలా చేస్తాయి. భారతదేశంలోనే ఈ నైట్ సైట్‌లను తయారు చేయడానికి MKU లిమిటెడ్, మెడ్‌బిట్ టెక్నాలజీస్ కన్సార్టియం ఒప్పందం కుదుర్చుకుంది.
కీలకమైన రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ స్థావరాన్ని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సందర్శించారు. అంతకుముందు, సిడ్నీలో భారత్-ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. అన్ని రంగాలలో ఇరు దేశాలు..