Share News

India Defence: రూ.67వేల కోట్ల రక్షణ కొనుగోళ్లకు డీఏసీ ఓకే

ABN , Publish Date - Aug 06 , 2025 | 05:58 AM

లక మిలటరీ ప్రాజెక్టులకు మంగళవారం రక్షణ ఉత్పత్తుల కొనుగోలు మండలి

India Defence: రూ.67వేల కోట్ల రక్షణ కొనుగోళ్లకు డీఏసీ ఓకే

న్యూఢిల్లీ, ఆగస్టు 5: కీలక మిలటరీ ప్రాజెక్టులకు మంగళవారం రక్షణ ఉత్పత్తుల కొనుగోలు మండలి(డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌-డీఏసీ) ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన ఈ మండలి సమావేశంలో రూ.67వేల కోట్లు విలువ చేసే ప్రాజెక్టులకు అంగీకారం తెలిపింది. ఇందులో దీర్ఘ గమన డ్రోన్లు, పర్వతప్రాంత రాడార్లు, క్షిపణుల వ్యవస్థలు ఉన్నాయి. నేవీ కోసం ‘కాంపాక్ట్‌ అటానమస్‌ సర్ఫేస్‌ క్రాఫ్ట్‌’, బ్రహ్మోస్‌ ఫైర్‌ కంట్రోల్‌ సిస్టంతో పాటు లాంచర్లను కొనుగోలు చేయనుంది. బారక్‌-1 క్షిపణి వ్యవస్థ స్థాయిని పెంచనుంది. వాయుసేన కోసం పర్వతప్రాంత రాడార్లు, సాక్షం/స్పైడర్‌ ఆయుధాల వ్యవస్థను కొనుగోలు చేయనుంది. మూడు దళాల కోసం మానవ రహిత విమానాలైన మీడియం ఆల్టిట్యూడ్‌ లాంగ్‌ ఎండ్యూరెన్స్‌ (మేల్‌) రిమోట్‌లీ పైలెటెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (ఆర్‌పీఏ)లను సేకరించేందుకు అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉండగా, నాలుగు డోర్ల క్యాబిన్‌తో వ్యూహాత్మక రక్షణ పరికరాల రవాణాకు వినియోగించే హై మొబిలిటీ వెహికిల్స్‌ (హెచ్‌ఎంవీ)ను తయారు చేసేందుకు ఆర్మీ నుంచి భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌ (బీఈఎంఎల్‌) రూ.282 కోట్ల విలువైన ఆర్డర్‌ దక్కించుకుంది.

Updated Date - Aug 06 , 2025 | 05:58 AM