Share News

Fighter Jets Deal: HALతో రూ.62వేల కోట్ల ఒప్పందం

ABN , Publish Date - Sep 25 , 2025 | 07:02 PM

భారత రక్షణ మంత్రిత్వ శాఖ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో రూ.62,370 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా భారత వాయుసేనకు 97 LCA తేజస్, Mk1A ఫైటర్ జెట్ విమానాలు సమకూరనున్నాయి.

Fighter Jets Deal: HALతో రూ.62వేల కోట్ల ఒప్పందం
Fighter Jets Deal

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: భారత రక్షణ మంత్రిత్వ శాఖ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL)తో రూ.62,370 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా భారత వాయుసేన (IAF)కు 97 LCA తేజస్, Mk1A ఫైటర్ జెట్ విమానాలు (68 సింగిల్-సీటర్లు, 29 రెండు-సీటర్ ట్రైనర్లు) సమకూరనున్నాయి.

defence.jpg


స్వదేశీ టెక్నాలజీతో తయారైన తేజస్ Mk1A జెట్ విమానాలు అధునాతన UTTAM AESA రాడార్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌లతో రూపొందాయి.

defence-1.jpg


ఈ భారీ ప్రాజెక్ట్‌లో 105 భారతీయ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఫలితంగా దేశంలో సంవత్సరానికి 11,750 ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా. 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యానికి ఊతమిచ్చే ఈ ఒప్పందం తాలూకూ డెలివరీలు 2027-28 నుంచి ఆరేళ్లలో పూర్తవుతాయి. ఈ చారిత్రక డీల్ భారత వాయుసేన శక్తిని బలోపేతం చేయడమే కాకుండా, దేశీయ రక్షణ ఉత్పత్తిని, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది.

defence-1.jpg


ఇవి కూడా చదవండి:

హెచ్-1బీ వీసాదారుల్లో 80 శాతం మాయం.. అమెరికన్లకు ఇదే ఛాన్స్.. నెటిజన్ పోస్టుపై నెట్టింట డిబేట్

యూపీఐ అంటే ఇదీ.. పోయిందనుకున్న ఫోన్ దొరకడంతో సంబరపడ్డ జంట

Updated Date - Sep 25 , 2025 | 08:29 PM