484 Stubble Burning Incidents: ఢిల్లీలో వాయు కాలుష్యం.. పంజాబ్‌లో పెరుగుతున్న పంట వ్యర్థాల దగ్ధం కేసులు
ABN , Publish Date - Oct 23 , 2025 | 06:23 PM
తార్న్ తారన్‌లో అత్యధికంగా 154 కేసులు నమోదు అయ్యాయి. అమృత్‌సర్‌లో 126 కేసులు.. ఫిరోజ్‌పూర్‌లో 55, పాటియాలాలో 31, గురుదాస్‌పూర్‌లో 23 కేసులు నమోదు అయ్యాయి.
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. రోజురోజుకు కాలుష్యం స్థాయిలు పెరుగుతూ పోతున్నాయి. ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరోగ్య సమస్యలు సైతం వస్తున్నాయి. ఢిల్లీలో కాలుష్యం పరిస్థితి 9 సిగరెట్లు తాగితే ఎంత ప్రభావం ఉంటుందో అంతగా ఉంది. ఇంత గడ్డు పరిస్థితుల్లో పంజాబ్‌లో పంట వ్యర్థాల దగ్ధం కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. నెల రోజుల్లో ఏకంగా 484 కేసులు నమోదు అయ్యాయి.
సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 22 మధ్య కాలంలో ఈ మొత్తం కేసులు నమోదు అయ్యాయి. అక్టోబర్ 16వ తేదీ వరకు 188 కేసులు మాత్రమే ఉండేవి. ఆరు రోజుల్లోనే ఏకంగా 296 కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు పంజాబ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గురువారం కేసుల వివరాలను వెల్లడించింది. పంజాబ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డేటా ప్రకారం.. తార్న్ తారన్‌లో అత్యధికంగా 154 కేసులు నమోదు అయ్యాయి. అమృత్‌సర్‌లో 126 కేసులు..
ఫిరోజ్‌పూర్‌లో 55, పాటియాలాలో 31, గురుదాస్‌పూర్‌లో 23 కేసులు నమోదు అయ్యాయి. ప్రభుత్వం ఎంత చెప్పినా కూడా ప్రజలు వినటం లేదు. పంట వ్యర్థాలను దగ్ధం చేస్తూనే ఉన్నారు. 226 కేసుల్లో అధికారులు రూ.11 లక్షల ఫైన్లు వేశారు. ఇప్పటి వరకు రూ.7లక్షల వసూలు అయ్యాయి. ఢిల్లీ, ఎన్సీఆర్‌లలో వాయు కాలుష్యం పెరగడానికి పంజాబ్, హరియాణాలలో పంట వ్యర్థాల దగ్ధం కారణమనే ఆరోపణలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత..
ఏపీవాసులకు గుడ్‌న్యూస్.. రూ.8 వేలకే విజయవాడ-సింగపూర్ ఫ్లైట్ సర్వీసులు!