ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pak: భారత రక్షణ సమాచారంతో చైనా మాకు సహకరించింది... పాక్ రక్షణ మంత్రి వెల్లడి

ABN, Publish Date - Jun 27 , 2025 | 06:05 PM

వ్యూహాత్మక భాగస్వామ్యం కలిగిన దేశాలు ఒకరితో ఒకరు ఇంటెలిజెన్స్ సమాచారం పంచుకోవడం సహజమేనని ఖవాజా ఆసిఫ్ చెప్పారు. శాటిలైట్ ఇమేజినరీ, ఏమేరకు ముప్పు ఉండవచ్చనే సమాచారం వంటివి చైనా తమకు అందించిందని తెలిపారు.

ఇస్లామాబాద్: వివాదాస్పద వ్యాఖ్యలతో తరచు సంచలనం సృష్టించే పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్, భారత్‌తో మిలటరీ ఎంగేజ్‌మెంట్స్ సమయంలో చైనా తమకు సహకరించిందని, భారత్‌కు చెందిన కీలకమైన ఇంటెలిజెన్స్‌ సమాచారం తమతో పంచుకుందని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఉగ్రిక్తతల సమయంలో పాక్ తమ వ్యూహాత్మక సన్నద్ధతను పటిష్టం చేసుకునేందుకు వీలుగా భారతదేశ రక్షణ సామర్థ్యానికి సంబంధించిన సమాచారాన్ని చైనా తమకు ఇచ్చినట్టు చెప్పారు.

వ్యూహాత్మక భాగస్వామ్యం కలిగిన దేశాలు ఒకరితో ఒకరు ఇంటెలిజెన్స్ సమాచారం పంచుకోవడం సహజమేనని ఆయన చెప్పారు. శాటిలైట్ ఇమేజినరీ, ఏమేరకు ముప్పు ఉండవచ్చనే సమాచారం వంటివి చైనా తమకు అందించిందని ఖవాజా ఆసిఫ్ తెలిపారు. 'పరస్పరం ముప్పు ఉన్నప్పుడు దేశాల మధ్య సమాచారం పంచుకోవడం జరుగుతుంది. మేము ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో అలాంటి ఇబ్బందులు, సవాళ్లను ఇండియాతో చైనా ఎదుర్కొంటోంది. వ్యూహాత్మకంగా దగ్గరగా ఉండే రెండు దేశాల మధ్య ఇంటెలిజెన్స్ పంచుకోవడం సాధరణం' అని ఆసిఫ్ చెప్పారు.

పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్‌లోని 11 ఉగ్రస్థావరాలపై భారత్ విరుచుకుపడింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. దీంతో ఎల్‌ఓసీ వెంబడి జనావాసాలపై పాక్ దాడులకు దిగింది. భారత్ భీకరంగా ఈ దాడులను తిప్పికొట్టడంతో కాల్పుల విమరణ ఒప్పందం ప్రతిపాదనను పాక్ ముందుకు తెచ్చింది.

ఇవి కూడా చదవండి..

మళ్లీ షాకింగ్ ఘటన.. లా కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం

రథయాత్రలో అపశ్రుతి.. బీభత్సం సృష్టించిన ఏనుగు..

For More National News

Updated Date - Jun 27 , 2025 | 06:07 PM