Operation Sindoor: చైనాలో పాక్ విదేశాంగ మంత్రి పర్యటన, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇదే మొదటిసారి
ABN, Publish Date - May 18 , 2025 | 08:05 PM
పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ డార్ సోమవారంనాడు చైనాలో పర్యటించనున్నారు. భారత్ ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇషాక్ దార్ చైనాలో పర్యటించనుండటం ఇదే మొదటిసారి.
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ డార్ (Ishaq Dar) సోమవారంనాడు చైనా(China)లో పర్యటించనున్నారు. తన పర్యటనలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. మంగళవారంనాడు చైనాకు రానున్న ఆప్ఘనిస్థాన్ తాత్కాలిక విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖిని కూడా ఇషాక్ దార్ కలుసుకుంటారు.
Pakistan: లష్కరే టాప్ కమాండర్ పాక్‌లో హతం.. ఇండియాలో పలు ఉగ్రదాడుల్లో అతని ప్రమేయం
జియా న్యూస్ సమాచారం ప్రకారం, మూడు దేశాల నేతలు (విదేశాంగ మంత్రులు) త్రైపాక్షిక సమావేశం జరుపుతారు. ప్రాంతీయ వాణిజ్యం, భద్రతా సహకారం పెంపు, పాకిస్తాన్-ఇండియా మధ్య దాడుల అనంతరం దక్షిణ ఆసియాలో నెలకొన్న పరిస్థితులపై ప్రధానంగా మూడు దేశాల విదేశాంగ శాఖ మంత్రులు చర్చిస్తారని తెలుస్తోంది. 'ఆపరేషన్ సింధూర్' పేరుతో పాక్, పీఓకేలోని కీలక ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపుదాడి చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టిన అనంతరం పాక్ విదేశాంగ మంత్రి చైనాలో పర్యటించనుండటం ఇదే మొదటిసారి.
పహల్గాంలో ఏప్రిల్ 22న 26 మంది టూరిస్టులను ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా కాల్చిచంపడంతో 'ఆపరేషన్ సిందూర్' పేరుతో మే 7న పాక్, పీఐఓకేలోని 9 ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు మెరుపుదాడులు చేశాయి. దీంతో మే 8,9,10 తేదీల్లో పాకిస్థాన్ భారత సైనిక స్థావరాలపై దాడులకు ప్రయత్నించింది. అయితే భారత బలగాలు ఆకాష్ క్షిపణులు వంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌తో వాటిని దీటుగా తిప్పికొట్టాయి. తీవ్ర ప్రతిఘటనతో బెంబేలెత్తిన పాక్ మే 10న సంధి కోరుతూ కాల్పుల విరమణ ప్రతిపాదన ముందుకు తేవడంతో భారత్ అందుకు అంగీకరించింది.
ఇవి కూడా చదవండి..
IMF Conditions Pakistan: భారత్ ఆందోళన పర్యవసానం.. పాక్‌కు రుణాలపై ఐఎంఎఫ్ కొత్తగా 11 షరతులు
Erdogan Powerplay: తుర్కియే అధ్యక్షుడి ఆధిపత్య ప్రదర్శన.. వేలు పట్టుకుని వదలకుండా..
Navy Ship Video: బ్రిడ్జ్‌ను ఢీకొట్టిన నేవీ షిప్.. వీడియో చూస్తే మైండ్‌బ్లాంక్
Updated Date - May 18 , 2025 | 08:07 PM