ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Operation Sindoor: భారత్ దాడిపై పాక్ పౌరులు ఏమన్నారంటే

ABN, Publish Date - May 07 , 2025 | 01:51 PM

Operation Sindoor: పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ మెరుపుదాడులపై పాకిస్థానీయులు స్పందించారు. ఆపరేషన్ సిందూర్ గురించి మీడియాకు వెల్లడించారు పాక్ పౌరులు.

Pakistani Civilian Reaction

పాకిస్థాన్, మే 7: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత సైన్యం. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్‌లో ఉగ్రమూకలపై భారత ఆర్మీ విరుచుకుపడింది. పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను టార్గెట్‌గా చేసుకుని దాడులు జరుపగా.. సుమారు 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ సంయుక్తంగా ఈ మెరుపు దాడులు చేపట్టింది. బహావల్‌పూర్, కోట్లీ, ముజఫరాబాద్‌పై క్షిపణి దాడులు జరిగాయి. పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై భారత్‌ దాడి వార్త ప్రపంచ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఒక్కసారిగా దాడులు జరగడంతో పాకిస్థాన్ పౌరులు భయాందోళనకు గురయ్యారు. మెరుపు దాడులతో పాకిస్థాన్ పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.


పాక్ పౌరుల ఏమన్నారంటే

అయితే భారత్ దాడిపై పాక్‌ పౌరులు స్పందించారు. ‘4 డ్రోన్స్ వచ్చాయి. అంతటా భయాందోళనలు నెలకొన్నాయి’ అని పాకిస్థాన్‌లోని మురేడ్కే‌లోని స్థానికులు చెబుతున్నారు. ఉగ్ర స్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి ప్రత్యక్ష సాక్షి మీడియాతో మాట్లాడారు. ‘రాత్రి 12.45 గంటల ప్రాంతంలో మొదట ఒక డ్రోన్ వచ్చింది. ఆ తరువాత మరో మూడు డ్రోన్స్ వచ్చాయి. మసీదులపై దాడి చేశాయి. మొత్తం ధ్వంసమైపోయింది’ అని చెప్పుకొచ్చాడు.


మరోవైపు పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై దాడికి సంబంధించిన వివరాలను భారత త్రివిధ దళాలు మీడియాకు తెలియజేశాయి. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల కుటుంబాలకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు తెలిపారు. తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపామని.. ఆ స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు చెప్పారు. పాకిస్థాన్ పౌరులకు ఎలాంటి హానీ కలుగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మరీ ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించామని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్న వారిపట్ల పాకిస్థాన్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే భారత్ తగిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియా సమావేశంలో వెల్లడించారు.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: 9 టెర్రర్ క్యాంప్‌లు.. జస్ట్ 24 నిమిషాల్లో ఖతం..

Pawan Kalyan: ప్రతి భారతీయుడు హర్షించదగ్గ పరిణామం

Read Latest International News And Telugu News

Updated Date - May 07 , 2025 | 04:12 PM