Nikki Haley Criticize: భారత్‌ను దూరం చేసుకోవద్దు
ABN, Publish Date - Aug 07 , 2025 | 04:05 AM
భారత్‌తో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరును రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ ఆక్షేపించారు. చైనాతో ఒకలా, భారత్‌లో
భారత్‌తో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరును రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ ఆక్షేపించారు. చైనాతో ఒకలా, భారత్‌లో ఒకలా వ్యవహరిస్తూ ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తున్నారని విమర్శించారు. ఈ అంశంపై సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ‘‘రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేయవద్దు. కానీ ప్రత్యర్థి దేశం చైనా చేయవచ్చా? రష్యా, ఇరాన్‌ల నుంచి అత్యధికంగా చమురును కొంటున్నది చైనాయే. ఆ దేశానికి మాత్రం సుంకాల నుంచి 90 రోజులు మినహాయింపు ఇచ్చారు. చైనాను ఇలా వదిలేయవద్దు. భారత్ వంటి బలమైన మిత్రదేశంతో సంబంధాలను చెడగొట్టుకోవద్దు’’ అని నిక్కీ హేలీ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఊటీలో పర్యాటక ప్రాంతాల మూసివేత.. కారణం ఏంటంటే..
అమిత్‌షాపై పరువునష్టం వ్యాఖ్యలు.. రాహుల్‌కు బెయిల్
Read Latest Telangana News and National News
Updated Date - Aug 07 , 2025 | 04:05 AM