Nepal KP Oli Dubai: నేపాల్లో రాజకీయ సంక్షోభం..దుబాయ్ పారిపోతున్న ప్రధాని ఓలీ?
ABN, Publish Date - Sep 09 , 2025 | 12:18 PM
నేపాల్ రాజకీయం ఉత్కంఠ భరితంగా మారింది. దేశంలో రాజకీయ సంక్షోభం తీవ్రమవుతున్న వేళ, ప్రధాని కేపీ శర్మ ఓలీ అనూహ్యంగా దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
నేపాల్లో (Nepal) రాజకీయ సంక్షోభం ఉద్ధృతమవుతున్న వేళ, ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ (KP Sharma Oli) దుబాయ్‌కు వెళ్లిపోయేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. దేశంలో రెండో రోజూ ఆందోళనలు ముదురుతున్న నేపథ్యంలో, ఓలీ విమానాన్ని సిద్ధం చేసుకుని, రాజకీయ అనిశ్చితి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల ఆగ్రహం, విపక్షాల నిరసనల మధ్య నేపాల్ రాజకీయాలు గందరగోళంగా మారాయి. దీంతో ఈ సంక్షోభం ఎటువైపు దారితీస్తుందనే ఉత్కంఠ నెలకొంది. ఓలీ నిర్ణయం దేశ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందనేది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.
కొనసాగుతున్న ఆందోళన
మరోవైపు సోషల్ మీడియా నిషేధానికి నిరసనగా మొదలైన ఈ ఉద్యమం మంగళవారం కూడా కొనసాగుతోంది. యువత మరింత ఆగ్రహంతో మాజీ ప్రధాని ప్రచండ ఇంటిపై దాడి చేశారు. అలాగే ప్రస్తుత మంత్రి ప్రిత్వీ సుబ్బా గురుంగ్ ఇంటిని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో ఈ ఆందోళనలు శాంతియుతంగా కొనసాగడం లేదు. పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు 20 మంది మరణించారు. మరో 400 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 100 మంది పోలీసులు కూడా ఉన్నారు.
గందర గోళంలో ప్రభుత్వం
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో హోం మంత్రి రమేష్ లేఖక్ ఇప్పటికే రాజీనామా చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి రామనాథ్ కూడా రిజైన్ చేశారు. ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడంతో, మిగతా మంత్రులపై కూడా ఒత్తిడి పెరిగింది. ఇదే సమయంలో ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీపై కూడా రాజీనామా కోసం ప్రతిపక్షం, ప్రజలు గట్టి ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతి చెందిన వారి పట్ల బాధపడుతున్నా, సోషల్ మీడియా వినియోగాన్ని ఆపాలనే ఉద్దేశం మాకు లేదని ఓ ప్రకటనలో ప్రధాని పేర్కొన్నారు. అయినప్పటికీ జనాలు నమ్మడం లేదు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 09 , 2025 | 12:36 PM