Nepal New PM: నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మాన్ ఘీసింగ్
ABN, Publish Date - Sep 11 , 2025 | 01:33 PM
ఇప్పుడు నేపాల్ రాజకీయ రంగంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని కేపీ శర్మ ఒలీ రాజీనామా చేసిన తర్వాత.. తాజాగా తాత్కాలిక ప్రధానమంత్రిగా కుల్మన్ ఘీసింగ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
నేపాల్ (Nepal) రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికర పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానమంత్రి కేపీ శర్మ ఒలీ అకస్మాత్తుగా రాజీనామా చేసి అనేక మందిని ఆశ్చర్యపరిచారు. ఈ క్రమంలోనే తాజాగా తాత్కాలిక ప్రధానమంత్రిగా కుల్మన్ ఘీసింగ్ (Nepal New Prime Minister Kulman Ghising) పేరును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ రాజకీయ మార్పులు నేపాల్ ప్రజలతోపాటు అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కొత్త నాయకత్వంలో నేపాల్ రాజకీయాలు ఎలా మారతాయోనని అందరూ వేచిచూస్తున్నారు.
కుల్మాన్ ఘీసింగ్ నేపాల్‌లోని నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (NEA) మాజీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఆయన నేపాల్‌లో దశాబ్దాలుగా సమస్యగా ఉన్న లోడ్ షెడ్డింగ్ (విద్యుత్ కోతలు) సమస్యను తన మొదటి హోదాలో (2016-2020) పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయం కారణంగా ఆయన నేపాల్ ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. అయితే, 2025 మార్చిలో ఆయనను NEA మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి ప్రభుత్వం తొలగించింది, ఇది వివాదాస్పద నిర్ణయంగా మారి, రాజకీయ నాయకులు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది.
కుల్మాన్ ఘీసింగ్ నేపాల్‌లో విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వ్యక్తి. ఆయన తొలగింపు వివాదాస్పదమైనప్పటికీ, జెన్ Z నిరసనల తర్వాత ఆయనను తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ పరిణామం నేపాల్ రాజకీయాల్లో ఒక కీలక మలుపును సూచిస్తుంది. అయితే ఈ నియామకం దీర్ఘకాలం కొనసాగుతుందా లేదా అనేది చూడాలి మరి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 11 , 2025 | 01:58 PM