Nepal floods: నేపాల్లో భారీ వర్షాలు, వరదలు.. 18 మంది మృతి
ABN, Publish Date - Oct 05 , 2025 | 12:40 PM
మొన్నటి వరకూ జెన్ జెడ్ ఆందోళనతో అట్టుడికిన దాయాది దేశం నేపాల్.. ఇప్పుడు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమౌతోంది. 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షాకాలం సెప్టెంబర్ చివరి వారంతో ముగిసినప్పటికీ..
నేపాల్, అక్టోబర్ 5 : మొన్నటి వరకూ జెన్ జెడ్ ఆందోళనతో అట్టుడికిన దాయాది దేశం నేపాల్.. ఇప్పుడు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమౌతోంది. కుండపోత వర్షాలు, పెల్లుబికుతున్న వరదలతో ఇప్పటి వరకూ ఆదేశంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. నేపాల్‌లోని ఇలమ్ జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. గత 24 గంటల్లో మృతుల సంఖ్య ఈ స్థాయికి చేరడం పరిస్థితికి అద్దం పడుతోంది.
ఇలమ్ జిల్లాలోని సూర్యోదయ మున్సిపాలిటీలో 5 మంది, మాంగ్సెబుంగ్ మున్సిపాలిటీలో ముగ్గురు, ఇలమ్ మున్సిపాలిటీలో ఆరు మంది, డెయుమై మున్సిపాలిటీలో ముగ్గురు, ఫాక్‌ఫోక్‌థుమ్ విలేజ్ కౌన్సిల్‌లో ఒక్కరు మరణించారని సదరు అధికారి తెలిపారు.
కాఠ్మాండూ వ్యాలీలో నదులు (బాగ్మతి, హనుమంతే, మనోహరా మొదలైనవి) నీటి స్థాయిలు పెరిగి, వరదలు, ల్యాండ్‌స్లైడ్‌లకు కారణమవుతున్నాయి. సున్సరి, ఉదయ్‌పూర్, సప్తరి, సిరాహా, ధనుషా, మహోత్తరి, సర్లాహి, రౌతహట్, బరా, పార్సా, సింధులి, డోలఖా, రామెఛాప్, సింధుపాల్‌చోక్, కవ్రేపాలాన్‌చోక్, కాఠ్మాండూ, లాలిత్పూర్, భక్తపూర్, మక్వాన్‌పూర్, చిత్వాన్ జిల్లాల్లో హై రిస్క్ ఉందని హైడ్రాలజీ అండ్ మెటియరాలజీ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 05 , 2025 | 12:41 PM