ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ship Sinking: మునిగిపోయిన కార్గో షిప్.. దానిలోని 3 వేల కొత్త కార్లు సైతం..

ABN, Publish Date - Jun 25 , 2025 | 09:25 AM

వేలకొద్ది కొత్త వాహనాలను మెక్సికోకు తీసుకెళ్తున్న ఓ భారీ కార్గో నౌక సముద్రంలో మునిగిపోయింది. మోర్నింగ్ మిడాస్‎లో రోజుల తరబడి మంటలు చెలరేగిన తర్వాత చివరికి సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Ship Sinking

సముద్ర మార్గంలో సంచలన ప్రమాదం జరిగింది. ఓ వాణిజ్య నౌకా రవాణాలో విషాదం (Cargo Ship Disaster) చోటుచేసుకుంది. వేలకొద్ది కొత్త వాహనాలను మెక్సికోకు తీసుకెళ్తూ, మోర్నింగ్ మిడాస్ అనే భారీ కార్గో నౌకలో అనుకోకుండా మంటలు చెలరేగాయి. ప్రారంభంలో అదుపులోకి వస్తాయని ఆశించినా, ఆ మంటలు క్రమంగా విస్తరించాయి. కొన్ని రోజుల సాగిన మంటలు చివరకు సముద్ర గర్భంలో కలిసిపోయింది (Ship Sinking). అదే సమయంలో అందులో ఉన్న కొత్త కార్లన్నీ నీటిలో కలిసిపోయాయి. అలస్కా సమీపంలోని అలూషియన్ దీవుల వద్ద అంతర్జాతీయ జలాల్లో ఇది జరిగింది.

3 వేల వాహనాలు కూడా..

600 అడుగుల పొడవైన కార్గో షిప్, మార్నింగ్ మిడాస్, సముద్ర గర్భంలో 16,404 అడుగుల లోతున మునిగిపోయింది. అయితే ఆ షిప్‌లో 3,000 కొత్త వాహనాలు ఉండగా, అవి కూడా సముద్ర జలాల్లో కలిసిపోయాయి. మార్నింగ్ మిడాస్, లండన్‌కు చెందిన జోడియాక్ మారిటైమ్ సంస్థ నిర్వహణలో ఉన్న లిబేరియన్ జెండా షిప్, మే 26, 2025న చైనాలోని యాంటాయ్ నుంచి మెక్సికోలోని లాజరో కార్డెనాస్‌కు బయలుదేరింది. ఈ షిప్‌లో 3,000 కొత్త వాహనాలు ఉన్నాయి. ఇవి గమ్యస్థానానికి చేరుకోవడానికి ముందే ఇలా జరిగింది.

22 మంది సిబ్బంది

జూన్ 3, 2025న అలాస్కా తీరానికి 300 మైళ్ల దూరంలో ఉండగా ఆ కార్గో నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు అదుపు చేయలేనంతగా వ్యాపించాయి. దీంతో షిప్ క్రమంగా నిర్వీర్యమైంది. షిప్ నుంచి ఒక డిస్ట్రెస్ సిగ్నల్ రావడంతో దీనికి సమీపంలోని యుఎస్ కోస్ట్ గార్డ్ వెంటనే స్పందించింది. షిప్‌లోని 22 మంది సిబ్బందిని సురక్షితంగా లైఫ్‌ బోట్‌లలో బయటకు తీసుకొచ్చారు. సమీపంలోని ఒక మర్చంట్ మెరైన్ షిప్ వారిని రక్షించింది. అదృష్టవశాత్తూ, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.

యూఎస్ కోస్ట్ గార్డ్ చర్యలు

షిప్ మునిగిపోయిన తర్వాత, యూఎస్ కోస్ట్ గార్డ్ అధికారి కామెరాన్ స్నెల్ మాట్లాడుతూ .. కాలుష్య సంకేతాలు కనిపిస్తే, వెంటనే స్పందించేందుకు కోస్ట్ గార్డ్ సిద్ధంగా ఉందని.. షిప్ మునిగిన ప్రాంతంలో కాలుష్య నియంత్రణ పరికరాలతో కూడిన రెండు సాల్వేజ్ టగ్‌లను నియమించారని... జోడియాక్ మారిటైమ్ సంస్థ కూడా అదనపు సహాయం కోసం ఒక కాలుష్య నియంత్రణ వాహనాన్ని పంపుతోందని కామెరాన్ స్నెల్ తెలిపారు .

ఇవీ చదవండి:

జూన్ 25 నుంచి 30 వరకు వర్షాలు.. ఏ ప్రాంతాల్లో ఉన్నాయో తెలుసా..


ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 25 , 2025 | 03:10 PM