ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Russia Attack on Ukraine: 800 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా

ABN, Publish Date - Sep 07 , 2025 | 08:52 PM

కీవ్ మంత్రిమండలి భవంతి పైకప్పు నుంచి పొగలు రావడం కనిపించాయని, అయితే క్షిపణులు తాకడం వల్లే ఈ పొగలు వచ్చాయా అనేది తెలియాల్సి ఉందని కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్ క్యాబినెట్ బిల్డింగ్‌పై దాడి జరిగినట్టు కీవ్ ప్రతినిధి ధ్రువీకరించారు.

Rusia Drone attack on Kyiv

కీవ్: రష్యా (Russia) మరోసారి ఉక్రెయిన్‌ (Ukraine) పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. 800కు పైగా డ్రోన్లు, 13 క్షిపణులతో ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌పై దాడులు జరిపింది. తొలిసారిగా ఒక ప్రభుత్వ కార్యాలయానికి లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఇద్దరు పౌరులు మరణించారు. ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన తర్వాత ఇంత పెద్ద స్థాయిలో రష్యా గగనతల దాడులు జరపడం ఇదే మొదటిసారి.

కీవ్ మంత్రిమండలి భవంతి పైకప్పు నుంచి పొగలు రావడం కనిపించాయని, అయితే క్షిపణులు తాకడం వల్లే ఈ పొగలు వచ్చాయా అనేది తెలియాల్సి ఉందని కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్ క్యాబినెట్ బిల్డింగ్‌పై దాడి జరిగినట్టు కీవ్ ప్రతినిధి ధ్రువీకరించారు. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక శకటాలు, అంబులెన్సులు అక్కడికి చేరుకున్నాయి. క్యాబినెట్ భవంతి పరిసరాలను కట్టుదిట్టం చేసారు. ఇందులో ఉక్రెయిన్ మంత్రుల నివాసాలు, కార్యాలయాలు ఉన్నాయి.

ఇదే మొదటిసారి

సిటీ సెంటర్‌లోని ప్రభుత్వ భవంతులపై శత్రువు తొలిసారి దాడులకు దిగినట్టు ఉక్రెయిన్ ప్రధాని యూలియా స్విరిడెంకో తెలిపారు. ఈ దాడిలో భవంతి పైకప్పు, ఎగువ ఫ్లోర్‌లు దెబ్బతిన్నట్టు చెప్పారు. భవంతులైతే పునరుద్ధరించుకుంటామని, కానీ పోయిన ప్రాణాలు తిరిగి తేలేమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి..

ఉత్తర కొరియాలో అమెరికా సీక్రెట్ ఆపరేషన్

అక్టోబర్‌లో దక్షిణ కొరియా పర్యటనకు ట్రంప్!, జిన్‌పింగ్‌తో భేటీకి ప్రయత్నాలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 07 , 2025 | 09:46 PM