ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gaza war: పాలస్తీనా వాసుల తరలింపునకు ఇజ్రాయెల్ సిద్ధం.. హమాస్‌పై ఇక భీకరపోరు..

ABN, Publish Date - Aug 17 , 2025 | 12:58 PM

గాజాను అదుపులోకి తీసుకోవడానికి సంబంధించిన ప్రణాళికకు ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యుద్ధం జరుగుతున్న ప్రాంతాలకు వెలుపల ఉన్న పౌరులకు మానవతా సాయం అందిస్తూనే, గాజా సిటీని పూర్తిగా నియంత్రణలోకి తీసుకోవడానికి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సిద్ధమవుతోంది

గాజా (Gaza)ను అదుపులోకి తీసుకోవడానికి సంబంధించిన ప్రణాళికకు ఇజ్రాయెల్ (Israel) సెక్యూరిటీ క్యాబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యుద్ధం జరుగుతున్న ప్రాంతాలకు వెలుపల ఉన్న పౌరులకు మానవతా సాయం అందిస్తూనే, గాజా సిటీని పూర్తిగా నియంత్రణలోకి తీసుకోవడానికి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తర గాజా నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇజ్రాయెల్ సరికొత్త వ్యూహంతో మందుకెళ్తోంది.

ఈ నేపథ్యంలో ఉత్తర గాజాలోని పోరాట ప్రాంతాలలో నివసిస్తున్న పాలస్తీనా వాసులను దక్షిణ గాజాకు తరలించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఇజ్రాయెల్ శనివారం ప్రకటించింది. ఈ ప్రాంతంలో దాదాపు 22 లక్షల మంది నివసిస్తున్నారు. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించబోతున్నారు. ఉత్తర గాజా నగరం, అల్-మవాసి ప్రాంతాలలో హమాస్‌ (Hamas)‌కు బలం ఎక్కువ. ఈ రెండు ప్రాంతాలను పూర్తిగా ధ్వంసం చేయడానికి సైన్యానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుమతినిచ్చింది.

ఈ నేపథ్యంలో గాజా నగరంలోని సామాన్య పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, గాజా నివాసితులకు ఆదివారం నుంచి టెంట్లు, ఇతర ఆశ్రయ పరికరాలను అందించనున్నారు. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించిన తర్వాత ఐడీఎఫ్ రంగంలోకి దిగుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ పూరీ ఘనత మన తెలుగువారిదే...

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం..

Updated Date - Aug 17 , 2025 | 12:58 PM