ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trump Praise Iran Ballistic Attack: ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణుల దాడి.. ప్రశంసిస్తూ డొనాల్డ్ ట్రంప్‌ వ్యాఖ్యలు

ABN, Publish Date - Jun 26 , 2025 | 07:29 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణుల దాడులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆ బాలిస్టిక్‌ క్షిపణులు ఇజ్రాయెల్‌పై భారీగా ఎటాక్ చేశాయని (Trump Praise Iran Ballistic Attack), చాలా భవనాలను నాశనం చేశాయని పేర్కొన్నారు. ట్రంప్‌ ఈ దాడిని ప్రశంసిస్తూ, ఇరాన్‌ శక్తి ప్రదర్శనను వివరించడం విశేషం.

Trump Praise Iran Ballistic Attack

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణుల దాడులను (Trump Praise Iran Ballistic Attack) ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆ బాలిస్టిక్‌ క్షిపణులు ఇజ్రాయెల్‌ను గట్టిగా తాకాయని, అనేక భవనాలను ధ్వంసం చేశాయని అన్నారు. ఈ వ్యాఖ్యల ప్రకారం.. ఇరాన్‌ క్షిపణులు ఇజ్రాయెల్‌కు భారీ నష్టాన్ని కలిగించాయని చెప్పవచ్చు. ఈ దాడుల ప్రభావం వల్లే ట్రంప్‌ హఠాత్తుగా ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధ విరమణకు పిలుపునిచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎవరి ముందూ కూడా..

అంతకుముందు.. ట్రంప్‌.. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ ముందు కొన్ని షరతులు పెట్టారు. దానికి అంగీకరించాల్సిందేనని అన్నారు. అయితే, ఖమేనీ ఆ షరతులను అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఇరాన్‌ ఎవరి ముందూ తలవంచదని, కేవలం అల్లా ముందు మాత్రమే సాష్టాంగపడుతుందని ఆయన ప్రకటించారు. ఇకపోతే ఇరాన్‌ దాదాపు 1,000 క్షిపణులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (IDF) తెలిపింది. వీటిలో ఎక్కువ భాగం బాలిస్టిక్‌ క్షిపణులే ఉన్నాయి.

ఇరాన్‌ ఉపయోగించిన ప్రధాన బాలిస్టిక్‌ క్షిపణులు

  • షహాబ్‌-3: ఈ మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి 1,000 నుంచి 1,300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఇజ్రాయెల్‌లో అనేక లక్ష్యాలను సైతం ఈ క్షిపణి తాకగలదు. ఇది ఇరాన్‌ వ్యూహాత్మక ఆయుధాల్లో కీలకమైనది.

  • ఖొర్రంషహర్‌-4: ఈ దీర్ఘ శ్రేణి క్షిపణి 2,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఇజ్రాయెల్‌ నగరాలను లక్ష్యంగా చేసుకునే ఈ క్షిపణిని రోడ్డు మీది నుంచి ప్రయోగించవచ్చు. రాడార్‌ దృష్టిని తప్పించగలదు. బహుళ వార్‌హెడ్‌లను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంది. అమెరికా ఇరాన్‌ అణు కేంద్రాలపై దాడి చేసిన తర్వాత ఈ క్షిపణి ఉపయోగించినట్లు తెలుస్తోంది.

  • సెజ్జిల్‌: ఇది ఇరానియన్-ఇంజనీరింగ్ ఆధారంగా రూపొందించిన బాలిస్టిక్ క్షిపణి. ఉపరితలం నుంచి ఉపరితలంలో 2,000 నుంచి 2,500 కిలోమీటర్ల మధ్య ఉన్న లక్ష్యాలను ఛేధిస్తుంది.

అమెరికా దాడుల ప్రభావం

ఇరాన్‌ అణు కార్యక్రమంపై అమెరికా దాడులు భారీ నష్టాన్ని కలిగించాయని ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ దాడి ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. ఇజ్రాయెల్‌ అటామిక్‌ ఎనర్జీ కమిషన్‌ ప్రకారం, ఈ దాడుల వల్ల ఇరాన్‌ అణు కార్యక్రమం చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్లింది. అమెరికా ప్రాథమిక గూఢచర్య సమాచారం ప్రకారం, ఈ దాడులు కేవలం తాత్కాలిక నష్టాన్ని మాత్రమే కలిగించాయి. ఇరాన్‌ మాత్రం తమ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసమేనని చెబుతోంది. కానీ, అమెరికా, ఇజ్రాయెల్‌ నాయకులు ఇరాన్‌ అణు కార్యక్రమం అణ్వాయుధాల తయారీకి దారితీస్తుందని ఆరోపిస్తున్నారు.

ఇవీ చదవండి:

జూన్ 25 నుంచి 30 వరకు వర్షాలు.. ఏ ప్రాంతాల్లో ఉన్నాయో తెలుసా..


ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 26 , 2025 | 05:23 PM