ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Student Visa Restrictions In US: అమెరికాలోకి ఈబీ5 రూట్‌

ABN, Publish Date - Aug 05 , 2025 | 04:07 AM

అమెరికాలో ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వీసాలపై ఆంక్షలు పెరిగాయి. ముఖ్యంగా భారతీయులకు

  • హెచ్‌1బీ, విద్యార్థి వీసాలపై ఆంక్షల నేపథ్యంలోపెట్టుబడుల మార్గం పడుతున్న భారతీయులు

  • 2024 అక్టోబర్‌- 2025 జనవరి మధ్య 1,200 దరఖాస్తులు..649 వీసాల మంజూరు

వాషింగ్టన్‌, ఆగస్టు 4: అమెరికాలో ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వీసాలపై ఆంక్షలు పెరిగాయి. ముఖ్యంగా భారతీయులకు విద్యార్థి వీసాలు, చదువు పూర్తయ్యాక తాత్కాలిక ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్‌ 1బీ వీసాలు అందడం కష్టంగా మారింది. 2024 అక్టోబర్‌ నుంచి 2025 మార్చి మధ్య.. అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఏకంగా 43.5 శాతం విద్యార్థి వీసాలు తగ్గిపోయాయి. ఈ క్రమంలో అమెరికాకు వెళ్లేందుకు భారతీయులు ‘ఈబీ-5’ వీసాల మార్గం పడుతున్నారు. ఇక అమెరికాలో గ్రీన్‌కార్డులు, హెచ్‌1బీ తదితర వీసాలకు సంబంధించి ప్రస్తుతం కోటీ పది లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు అంచనా. వాటిని పరిష్కరించేందుకు కొన్నేళ్లు పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో త్వరగా శాశ్వత నివాస అర్హత పొందేందుకు ఈబీ-5 వీసా వీలు కల్పిస్తుంది. ‘అమెరికన్‌ ఇమిగ్రెంట్‌ ఇన్వెస్టర్‌ అలయన్స్‌ (ఏఐఐఏ)’ తాజాగా ఈ వివరాలను వెల్లడించింది. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి భారతీయులు ఈబీ-5 వీసాల కోసం దరఖాస్తు చేసుకోవడం ఇంతకుముందెన్నడూ లేనంతగా పెరిగిందని తెలిపింది. ఈబీ-5 వీసాల కోసం భారతీయుల నుంచి 2024 అక్టోబర్‌ నుంచి 2025 జనవరి వరకు 1,200 దరఖాస్తులు వచ్చాయని, అందులో 649 వీసాలు మంజూరయ్యాయని యూనైటెడ్‌ స్టేట్స్‌ ఇమిగ్రేషన్‌ ఫండ్‌ (యూఎ్‌సఐఎఫ్‌) చీఫ్‌ నికోలస్‌ తెలిపారు. అంతకుముందు 2023 అక్టోబర్‌ నుంచి సెప్టెంబర్‌ 2024 వరకు ఏడాది కాలంలో మంజూరైన ఈబీ-5 వీసాలు 1,428 మాత్రమేనని తెలిపారు. అమెరికాలో నివాసం కోసం రకరకాల వీసాల అవసరం లేకుండా ‘గోల్డ్‌ కార్డు’ ప్రవేశపెడుతున్నామని.. రూ.43.8 కోట్లు (5 మిలియన్‌ డాలర్లు) చెల్లించి ‘గోల్డ్‌ కార్డు’ను పొందవచ్చని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈబీ-5 వీసా స్థానంలోనే గోల్డ్‌ కార్డును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అది అమల్లోకి వచ్చేలోగానే ఈబీ-5 వీసాతో అమెరికాలో నివాస అర్హత పొందేందుకు భారతీయులు క్యూ కడుతున్నారు.

ఏమిటీ ఈబీ-5 వీసా..

అమెరికాలో పెట్టుబడులు పెట్టి, స్థానికంగా ఉద్యోగాలు కల్పించేవారికి నివాస అర్హత కల్పిస్తూ ఈబీ-5 వీసాలను జారీ చేస్తారు. అమెరికాలోని సాధారణ ప్రాంతాల్లో సుమారు రూ.9.2 కోట్లు (10.5 లక్షల డాలర్లు) లేదా ‘టార్గెటెడ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఏరియా (టీఈఏ)’లలో రూ.7 కోట్లు (8 లక్షల డాలర్లు) పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. పెట్టుబడి పెట్టినవారితోపాటు వారి జీవిత భాగస్వామి, వివాహం కాని 21 ఏళ్లలోపు పిల్లలకు అమెరికాలో శాశ్వత నివాస అర్హత లభిస్తుంది.. ఈబీ-5 గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాక మూడు నుంచి ఆరు నెలల్లోపే ఉద్యోగ, ప్రయాణ పర్మిట్లు వస్తాయని.. ఈబీ-5 గ్రీన్‌కార్డు మంజూరయ్యే వరకు ఆగాల్సిన అవసరం లేదని వివరించారు. కాగా, అమెరికాలో స్థానికుల ఉద్యోగావకాశాలను విదేశీ విద్యార్థులు కొల్లగొట్టేందుకు హెచ్‌-1బీ వీసాలు కారణమవుతున్నాయని.. అందువల్ల హెచ్‌-1బీ వీసాలను మొత్తంగా ఎత్తేయాలని ట్రంప్‌ సన్నిహితుడు స్టీవ్‌ బానన్‌ డిమాండ్‌ చేశారు. అమెరికాకు వస్తున్న విదేశీ విదార్థులను వారి చదువు పూర్తికాగానే స్వదేశాలకు తిప్పి పంపేయాలని ప్రతిపాదించారు.B

ఇవి కూడా చదవండి..

శ్రీకృష్ణుడే మొదటి రాయబారి.. సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

గల్వాన్ వ్యాలీ వివాదంలో రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు వార్నింగ్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 05 , 2025 | 04:07 AM