Supreme Court: శ్రీకృష్ణుడే మొదటి రాయబారి.. సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 04 , 2025 | 03:49 PM
ఆలయ నిధుల నుంచి రూ.500 కోట్లతో టెంపుల్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. అయితే దీన్ని టెంపుల్ ట్రస్టు సవాలు చేసింది. దీనిపై విచారణ సందర్భంగా శ్రీకృష్ణుడి రాయబారం గురించి సుప్రీంకోర్టు ప్రస్తావించింది.
న్యూఢిల్లీ: బృందావనంలోని శ్రీ బాంకే బిహారీ టెంపుల్ ట్రస్ట్ వివాదంలో సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారంనాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'శ్రీకృష్ణుడే మొదటి రాయబారి' అని పేర్కొంది. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు ఇరు పక్షాలు ప్రయత్నించాలని సూచించింది.
ఆలయ నిధుల నుంచి రూ.500 కోట్లతో టెంపుల్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. అయితే దీన్ని టెంపుల్ ట్రస్టు సవాలు చేసింది. దీనిపై విచారణ సందర్భంగా శ్రీకృష్ణుడి రాయబారం గురించి సుప్రీంకోర్టు ప్రస్తావించింది. 'శ్రీకృష్ణుడే మొదటి రాయబారి. దయచేసి మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి' అని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వానికి, టెంపుల్ ట్రస్టుకు మధ్య సమస్య పరిష్కారానికి కమిటీని ప్రతిపాదించింది. ఆర్డినెన్స్ ఆమోదించడంలో తొందర ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. యూపీ ప్రభుత్వ ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధతను పరిశీలించాలని అలహాబాద్ హైకోర్టును ఆదేశించింది.
కాగా, కారిడార్ రీడవలప్‌మెంట్ కోసం ప్రైవేటు ఓనర్లకు పరిహారం చెల్లించి ఎందుకు భూములను సేకరించరాదని గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే చట్టప్రకారం చేయడానికి అడ్డేముంటుందని ప్రశ్నించింది. గత మేలో కూడా సుప్రీంకోర్టు యూపీ సర్కార్‌ను ప్రశ్నించింది. టెంపుల్ మేనిజిమెంట్‌పై రెండు ప్రైవేటు పార్టీల మధ్య లిటిగేషన్ ఉండగా యూపీ ప్రభుత్వం ఎందుకు హైజాక్ చేయాలని చూస్తోందని నిలదీసింది.
2022లో జన్మాష్టమి ఉత్సవాల్లో తొక్కిసలాట తరహా ఘటన చోటుచేసుకుని ఇద్దరు భక్తులు మరణించడంతో ఆలయ రీడవలప్‌మెంట్‌కు డిమాండ్లు వచ్చాయి. క్రౌడ్ ప్రెజర్, భద్రత దృష్ట్యా కారిడార్‌ను అభివృద్ధి చేయాలని 2023 సెప్టెంబర్‌లో అలహాబాద్ హైకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇవి కూాడా చదవండి..
కొంతమంది అధికారాన్ని పంచుకునేందుకు ఇష్టపడరు.. డీకే శివకుమార్ హాట్ కామెంట్స్
గల్వాన్ వ్యాలీ వివాదంలో రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు వార్నింగ్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి