ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indian national kidnapped: సూడాన్‌లో భారతీయుడిని కిడ్నాప్ చేసిన ఆర్‌ఎస్‌ఎఫ్ మిలీసియా

ABN, Publish Date - Nov 03 , 2025 | 08:12 PM

కొన్ని రోజులుగా హింసాత్మక ఘర్షణలు చెలరేగుతున్న సూడాన్‌లో రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మిలీషియా తాజాగా ఒక భారతీయుడిని కిడ్నాప్ చేసింది. ఆ కిడ్నాప్‌నకు సంబంధించిన వీడియో తాజాగా ఓ జాతీయ ఛానెల్‌కు వచ్చింది.

Indian national kidnapped

కొన్ని రోజులుగా హింసాత్మక ఘర్షణలు చెలరేగుతున్న సూడాన్‌లో రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మిలీషియా తాజాగా ఒక భారతీయుడిని కిడ్నాప్ చేసింది. ఆ కిడ్నాప్‌నకు సంబంధించిన వీడియో తాజాగా ఓ జాతీయ ఛానెల్‌కు వచ్చింది. ఒడిశాలోని జగత్సింగ్‌పూర్ జిల్లాకు చెందిన ఆదర్శ్ బెహెరా అనే భారతీయుడు ఇద్దరు మిలీషియా సభ్యుల మధ్య కూర్చున్నట్టు ఆ వీడియోలో కనబడుతోంది. వారిలో ఒకరు ఆదర్శ్‌ను 'మీకు షారుఖ్ ఖాన్ తెలుసా?' అని అడుగుతున్నాడు (RSF militia).

గత రెండేళ్లుగా సూడాన్‌లో, సూడాన్ సాయుధ దళాలు (SAF), రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎఫ్ సభ్యులు ఓ విదేశీయుడిని కిడ్నాప్ చేయడం సంచలనంగా మారింది. 36 ఏళ్ల బెహెరాను సూడాన్ రాజధని ఖార్టూమ్‌కు దాదాపు 1,000 కి.మీ దూరంలో ఉన్న అల్ ఫషీర్ నుంచి కిడ్నాప్ చేసినట్టు సమాచారం. బెహెరాను అల్ ఫషీర్ నుంచి దక్షిణ డార్ఫర్ రాజధాని అయిన నైలా నగరానికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది (India Sudan relations).

బెహెరా 2022 నుంచి సూడాన్‌లోని సుకారాతి ప్లాస్టిక్ ఫ్యాక్టరీ అనే కంపెనీలో పనిచేస్తున్నారని అతడి భార్య సుస్మిత్ తెలిపారు (Indian citizen abduction). ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. తన భర్త క్షేమం గురించి సుస్మిత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన భర్తను కాపాడాలని ఆమె ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

అడగడానికి ఇంకేమీ ప్రశ్నలు లేవా... నాయకత్వ మార్పుపై సిద్ధరామయ్య

Updated Date - Nov 03 , 2025 | 08:12 PM