ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: బాయ్‌కాట్ తుర్కియే, అజర్‌బైజాన్.. షాకిచ్చిన ఇండియన్స్, కోట్లలో నష్టం..

ABN, Publish Date - May 14 , 2025 | 06:36 PM

భారతీయులు పాకిస్థాన్‌కు సపోర్ట్ చేసిన దేశాలకు దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చారు. ట్రావెల్ బ్యాన్‌ పేరుతో తుర్కియే, అజర్‌బైజాన్‌లను బాయ్‌కాట్ చేస్తున్నారు. అయితే ఇది కేవలం బహిష్కరణ కాదని, భారత ఆత్మగౌరవమని చెబుతుండటం విశేషం.

India Boycott Turkey Azerbaijan

ఇండియాతో పెట్టుకుంటే ఏమవుతుందో భారతీయులు మరోసారి నిరూపించారు. అవును తగ్గేదేలే. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ దేశానికి అండగా నిలిచిన తుర్కియే(Turkey), అజర్‌బైజాన్‌(Azerbaijan)లకు ఇప్పుడు గట్టి షాక్ తగిలింది. ఎందుకంటే ప్రస్తుతం ఇండియన్ టూరిస్టులు బాయ్‌కాట్(Boycott) తుర్కియే, అజర్‌బైజాన్ అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక మంది భారత పర్యాటకులు ఈ రెండు దేశాలను బహిష్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వందలాది మంది భారతీయ ప్రయాణికులు టర్కీ, అజర్‌బైజాన్‌లను సందర్శించాలనే ప్లాన్ రద్దు చేసుకున్నారు. ఈ కారణంగా కేవలం 6 రోజుల్లోనే 50% కంటే ఎక్కువ బుకింగ్‌లు రద్దయ్యాయి.


మారిన బుకింగ్స్

ఈ సమయంలో తుర్కియేకి వెళ్లే వారి టిక్కెట్లలో 22%, అజర్‌బైజాన్‌కు వెళ్లే వారి టిక్కెట్లలో 30% కంటే ఎక్కువ ప్రయాణికులు రద్దు చేసుకున్నారని EaseMyTrip సహ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ నిశాంత్ పిట్టి అన్నారు. అంతేకాదు తుర్కియే, అజర్‌బైజాన్‌లకు వెళ్లవద్దని ఆర్‌పీజీ గ్రూప్ చైర్‌పర్సన్ హర్ష్ గోయెంకా, నటి రూపాలి గంగూలీ సైతం భారతీయులకు విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు సింగర్ విశాల్ మిశ్రా కూడా ఈ రెండు దేశాలలో తన రాబోయే ప్రదర్శనలను రద్దు చేసుకున్నారు. ఈ దేశాలకు బదులు ఇతర దేశాలు, దేశీయ నగరాలకు బుకింగ్‌లను తిరిగి చేసుకుంటున్నారు.


పెద్ద ఎత్తున నష్టం..

దీంతో తుర్కియే, అజర్‌బైజాన్‌లకు డిమాండ్ గణనీయంగా తగ్గిందని, అజర్‌బైజాన్‌కు కూడా భారీగా బుకింగ్‌లు రద్దు అయ్యాయని ఆయా వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో మే 8 నుంచే కొత్త బుకింగ్‌లు లేవన్నారు. ఈ రెండు దేశాలకు ప్రయాణ రద్దులు 250% పెరిగాయని EaseMyTrip తెలిపింది. దీంతో ఈ దేశాలు పెద్ద ఎత్తున టూరిజం పరంగా నష్టపోయినట్లు చెబుతున్నారు. గతంలో కూడా మాల్దీవుల విషయంలో కూడా ఇండియన్స్ ఇలాగే రియాక్ట్ అయ్యారు. మాల్దీవుల మంత్రి భారత్ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో భారత టూరిస్టులు మాల్దీవులను గతంలో బాయ్‌కాట్ చేశారు.


స్పందించిన పర్యాటక శాఖ

ఇదే సమయంలో భారతీయ పర్యాటకుల భద్రత, సంతృప్తిని నిర్ధారించడానికి తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని తుర్కియే పర్యాటక శాఖ తెలిపింది. పర్యాటకులకు మరింత సమాచారం లేదా స్పష్టత అవసరమైతే తమను సంప్రదించవచ్చని వెల్లడించింది. ఈ క్రమంలో హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలు లేదా ఇతర పర్యాటక ప్రదేశాలు భారతీయ ప్రయాణికులను ఎప్పటిలాగే పూర్తి గౌరవం, ఆతిథ్యంతో ఉంటాయని స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి

PM Kisan: రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు పడేది అప్పుడే..

Monsoon Forecast: 16 ఏళ్ల తర్వాత దేశంలో మే 27 నాటికే వర్షాలు.. ఎక్కడెక్కడ ఎప్పుడంటే..


Bhargavastra: ఆకాశంలో శత్రు డ్రోన్‌లను నాశనం చేసే స్వదేశీ 'భార్గవస్త్ర' పరీక్ష సక్సెస్

Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 14 , 2025 | 06:52 PM