PM Kisan: రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు పడేది అప్పుడే..
ABN , Publish Date - May 14 , 2025 | 05:53 PM
ప్రధానమంత్రి కిసాన్ యోజన (PM Kisan Yojana 2025) స్కీం గురించి మరో కీలక అప్‍డేట్ వచ్చేసింది. ఈ స్కీం ద్వారా రైతులకు ప్రతి ఏటా రూ. 6,000లను మూడు విడతలుగా అందిస్తారు. ఇప్పటికే దీనికి సంబంధించి 19 విడత నిధులను విడుదల చేయగా, 20వ విడత గురించి కీలక సమాచారం వచ్చింది.

దేశంలో రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ స్కీం ద్వారా అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం రూ.6,000లను మూడు విడతలుగా అందిస్తారు. ఈ క్రమంలో ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి మధ్య ఈ నిధులను పంపిణీ చేస్తారు. ఇప్పటికే 19వ విడత మొత్తం రూ.2,000 ఫిబ్రవరిలో రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇక, 20వ విడత సాయం కోసం రైతులు సిద్ధంగా ఉన్నారు. అయితే, ఈ విడత వాయిదా తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ 20వ విడత జూన్‌లో రావచ్చని తెలుస్తోంది.
కేవైసీ చేసుకున్నారా లేదా..
తదుపరి వాయిదా మీ ఖాతాకు సకాలంలో రావాలంటే e-KYC చేసుకోవడం చాలా ముఖ్యం. కేవైసీ అప్‌డేట్ లేని అకౌంట్లకు పీఎం కిసాన్ డబ్బులు రావు. కాబట్టి పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లో eKYC అప్‌డేట్ చేసుకోవాలి. అంటే PM కిసాన్ నమోదిత రైతులకు e-KYC తప్పనిసరి. మీరు e-KYCని రెండు విధాలుగా చేసుకోవచ్చు. మొదటిది వెబ్ సైట్ ద్వారా eKYC చేసుకోవడం. రెండోది మీ సమీపంలోని CSC (కామన్ సర్వీస్ సెంటర్)ని సందర్శించి కేవైసీ వివరాలను మార్చుకోవచ్చు.
PM కిసాన్ పోర్టల్‌లో e-KYC ఎలా చేయాలి
ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in కి వెళ్లి, హోమ్‌పేజీకి కుడి వైపున ఉన్న 'eKYC' ఆప్షన్‌పై క్లిక్ చేయండి
ఆ క్రమంలో మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయండి
ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయండి
ఆ క్రమంలో వచ్చిన ప్రధానమంత్రి కిసాన్ యోజన లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేయండి
రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామాన్ని ఎంచుకోండి
'రిపోర్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి
ఇప్పుడు మీ పంచాయతీ పరిధిలో అర్హత ఉన్న రైతుల జాబితా కనిపిస్తుంది. అందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేయండి
ఈ కారణాల వల్ల మీ దరఖాస్తు తిరస్కరించబడవచ్చు
నకిలీ పేరుతో దరఖాస్తు
e-KYC అసంపూర్ణంగా ఉండటం
తప్పు IFSC కోడ్
ఆధార్‌ను బ్యాంకుతో అనుసంధానించకపోవడం
తప్పు బ్యాంక్ లేదా పోస్టాఫీసు పేరు వంటివి
ఇవి కూడా చదవండి
Monsoon Forecast: 16 ఏళ్ల తర్వాత దేశంలో మే 27 నాటికే వర్షాలు.. ఎక్కడెక్కడ ఎప్పుడంటే..
Bhargavastra: ఆకాశంలో శత్రు డ్రోన్‌లను నాశనం చేసే స్వదేశీ 'భార్గవస్త్ర' పరీక్ష సక్సెస్
Penny Stock: ఈ స్టాక్‌పై రూ.4 లక్షల పెట్టుబడి..ఏడేళ్ల లోనే రూ.56 లక్షల లాభం..
Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి