ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India: క్యూఎస్‌ ర్యాంకుల్లో భారత్‌ వర్సిటీల జోరు

ABN, Publish Date - Jun 20 , 2025 | 04:26 AM

తాజాగా విడుదలైన క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌-2026 జాబితాలో రికార్డు స్థాయిలో 54 మన విద్యాసంస్థలు స్థానం సంపాదించాయి...

  • జాబితాలో 54 విద్యాసంస్థలతో రికార్డు

న్యూఢిల్లీ, జూన్‌ 19: ప్రపంచ యూనివర్సిటీల ర్యాంకింగ్స్‌లో మన దేశ విద్యాసంస్థలు సత్తాచాటాయి. గ్లోబల్‌ స్థాయి విద్యాసంస్థలకు దీటుగా నిలిచాయి. తాజాగా విడుదలైన క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌-2026 జాబితాలో రికార్డు స్థాయిలో 54 మన విద్యాసంస్థలు స్థానం సంపాదించాయి. ఈ జాబితాలో ఎక్కువ విద్యాసంస్థలు ఉన్న దేశాల్లో భారత్‌ నాలుగో స్థానంలో నిలవడం విశేషం. మన కంటే ముందు 192 సంస్థలతో అమెరికా, 90 ఇన్‌స్టిట్యూట్స్‌తో యూకే, 72 సంస్థలతో మెయిన్‌ల్యాండ్‌ చైనా ఉన్నాయి. గత ఏడాది 46 భారత విద్యాసంస్థలకు ఈ జాబితాలో చోటు దక్కింది. వీటిలో సుమారు సగం ఇన్‌స్టిట్యూట్‌లు ఈ ఏడాది తమ స్థానాలను మెరుగుపర్చుకున్నాయి.

కొత్తగా ఎక్కువ వర్సిటీలకు స్థానం దక్కిన దేశాల్లో ఈ ఏడాది భారత్‌ ముందు వరసలో ఉంది. ఇక మన దేశ సంస్థల్లో ఐఐటీ ఢిల్లీ రెండేళ్ల క్రితం కంటే 70 స్థానాలు మెరుగుపర్చుకుని 123వ స్థానం సాధించింది. ఐఐటీ బాంబే మాత్రం గత ఏడాది 118వ ర్యాంకు నుంచి.. ఈసారి 129వ స్థానానికి పడిపోయింది. ఐఐటీ మద్రాస్‌ 47 స్థానాలు ఎగబాకి 180వ స్థానం పొందింది. ఢిల్లీ యూనివర్సిటీ 328వ ర్యాంకును నిలబెట్టుకుంది. జేఎన్‌యూ తన ర్యాంకును మెరుగుపర్చుకుని 558వ స్థానం పొందింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ ఓవరాల్‌ ర్యాంకింగ్‌లో 801-850 మధ్య నిలిచ్చింది. సైటేషన్స్‌ ఫర్‌ ప్యాకల్టి విభాగంలో 335 స్థానాన్ని దక్కించుకుంది. క్యూఎస్‌ ర్యాంకుల పట్ల ప్రధాని మోదీ ఎక్స్‌లో స్పందిస్తూ.. దేశంలో విద్యారంగానికి ఇదో గొప్ప శుభవార్త అని చెప్పారు.

Updated Date - Jun 20 , 2025 | 04:30 AM