ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

SCO Group: హ్యాండిచ్చిన చైనా.. SCO భేటీ అసంపూర్ణం

ABN, Publish Date - Jun 26 , 2025 | 09:41 PM

చైనాలో జరిగిన SCO సమావేశం అసంపూర్ణమైంది. ఈ సమావేశంలో పాల్గొన్న సభ్య దేశాల రక్షణ మంత్రులు 'ఉగ్రవాదం' అనే పదాన్ని ప్రస్తావించడంపై ఏకాభిప్రాయానికి రాలేదు. దీంతో చర్చల ముగింపులో ఉమ్మడి ప్రకటనను..

Shanghai Cooperation Organisation

న్యూఢిల్లీ/బీజింగ్, జూన్ 26: చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (Shanghai Cooperation Organisation, SCO) సమావేశం అసంపూర్ణమైంది. ఈ సమావేశంలో పాల్గొన్న సభ్య దేశాల రక్షణ మంత్రులు 'ఉగ్రవాదం' అనే పదాన్ని ప్రస్తావించడంపై ఏకాభిప్రాయానికి రాలేదు. దీంతో చర్చల ముగింపులో ఉమ్మడి ప్రకటనను ఆమోదించలేకపోయారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇవాళ (గురువారం) తెలిపింది. SCO అనేది 10 దేశాల యురేషియన్ గ్రూప్. దీనిలో చైనా, రష్యా, భారత్, పాకిస్తాన్, ఇంకా ఇరాన్ సభ్యులుగా ఉన్నాయి. ఎస్‌సీవో సభ్యదేశాల వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ముందుగా ఆయా దేశాల రక్షణ మంత్రులతో ఈ సమావేశం జరిగింది.

చైనాలోని షాండోంగ్ ప్రావిన్స్‌లోని కింగ్‌డావోలో ఇవాళ (జూన్ 26)న జరిగిన ఈ రక్షణ మంత్రుల సమావేశానికి చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నాసిర్జాదే, కజకిస్తాన్ రక్షణ మంత్రి డౌరెన్ కోసనోవ్, కిర్గిజ్స్తాన్ రక్షణ మంత్రి రుస్లాన్ ముకంబెటోవ్, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఇంకా రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్‌లు హాజరయ్యారు.

అయితే, SCO లోని కొందరు సభ్యులు, సభ్య దేశాలు కొన్ని అంశాలపై ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి.. అందువల్ల చర్చల ముగింపు తీర్మానాన్ని మా వైపు నుంచి ఖరారు చేయలేకపోయామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వారాంతపు మీడియా సమావేశంలో చెప్పారు. భారతదేశం ఉగ్రవాదంపై ఆందోళనలను తీర్మాన పత్రంలో ప్రతిబింబించాలని కోరుకుంది, అయితే, ఇది ఒక నిర్దిష్ట దేశానికి ఆమోదయోగ్యం కాలేదు. అందువల్ల ఆ ప్రకటనను ఆమోదించలేదని రణధీర్ సదరు దేశం పేరు బయటపెట్టకుండా చెప్పారు.

ఏప్రిల్ 22న కాశ్మీర్‌లో హిందూ పర్యాటకులపై జరిగిన దాడిలో 26 మంది మరణించిన విషయాన్ని ప్రస్తావించకుండా, ఆ పత్రంపై సంతకం చేయడానికి భారత్ నిరాకరించింది. పాకిస్తాన్ ఈ దాడికి కారణమని భారత్ పేర్కొంది. కానీ పాకిస్థాన్ ఆ ఆరోపణను తిరస్కరించింది. ఆ దాడి లక్ష్యాలకు ఉగ్రవాదంతో సంబంధం లేదని, అంతేకాక అవి అక్కడి పౌరుల చేష్టలని చెప్పుకొచ్చింది. ఇక, భారత్ ఈ అంశంపై స్పందన కోసం చేసిన అభ్యర్థనకు చైనా, పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖలు వెంటనే స్పందించలేదు.

మరోవైపు, SCO ఉమ్మడి ప్రకటన గురించి విలేకరులు అడిగినప్పుడు, చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వివరణ ఇవ్వకుండానే.. సమావేశం విజయవంతమైన ఫలితాలను సాధించిందని మాత్రమే చెప్పారు. ఇదిలా ఉంటే, మే నెలలో జరిగిన ఇరుదేశాల ఘర్షణ తర్వాత భారత్, పాకిస్తాన్‌కు చెందిన సీనియర్ మంత్రులు ఒకే వేదికను పంచుకోవడం ఇదే మొదటిసారి.

ఈ వార్తలు కూడా చదవండి..

పాకిస్థాన్‌పై మరోసారి నిప్పులు చెరిగిన రక్షణ మంత్రి

నదిలో పడిన బస్సు.. ఒకరు మృతి.. ప్రయాణికులు గల్లంతు

For Telangana News And Telugu News

Updated Date - Jun 26 , 2025 | 09:51 PM