ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India vs Trump policy: ట్రంప్‌నకు షాక్.. తాలిబన్, పాకిస్థాన్, చైనా, రష్యాకు భారత్ మద్దతు..

ABN, Publish Date - Oct 08 , 2025 | 01:50 PM

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చర్యలు అంతర్జాతీయ సమీకరణాలను సమూలంగా మార్చేస్తున్నాయి. ముఖ్యంగా భారత్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా, చిరకాల ప్రత్యర్థులైన పాకిస్థాన్, చైనాకు మద్దతుగా కీలక నిర్ణయం తీసుకుంది.

Bagram airbase controversy

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చర్యలు అంతర్జాతీయ సమీకరణాలను సమూలంగా మార్చేస్తున్నాయి. ముఖ్యంగా భారత్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా, చిరకాల ప్రత్యర్థులైన పాకిస్థాన్, చైనాకు మద్దతుగా కీలక నిర్ణయం తీసుకుంది. తాలిబన్ పాలిత ఆఫ్ఘనిస్తాన్‌కు సంబంధించిన అంశం విషయంలో అమెరికాకు వ్యతిరేకంగా భారత్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం (India Bagram airbase news).

అఫ్గానిస్థాన్‌లోని బాగ్రామ్ ఎయిర్ బేస్ అమెరికాకు దక్షిణాసియాలో అతిపెద్ద వైమానిక స్థావరంగా చాలా కాలం కొనసాగింది. తాలిబన్లపై 20 ఏళ్ల యుద్ధంలో అమెరికా కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. అయితే అమెరికా వదిలేసి వెళ్లిపోయిన తర్వాత దానిని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అఫ్గాన్‌లో తాలిబన్ల పాలన కొనసాగుతోంది. అయితే ఆ వైమానిక స్థావరాన్ని తిరిగి తమకు అప్పగించాల్సిందిగా తాలిబన్లపై ట్రంప్ ఒత్తిడి తీసుకొస్తున్నారు (Trump Bagram bid). దక్షిణాసియాలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఈ స్థావరం అవసరమని, దానిని అమెరికా దళాలకు అప్పగించాలని అడుగుతున్నారు. ట్రంప్ చేస్తున్న ఈ ప్రయత్నాలను పలు దేశాలు వ్యతిరేకిస్తున్నాయి.

తాజాగా మాస్కో ఫార్మాట్ కన్సల్టేషన్స్‌లో పలు దేశాలు పాల్గొన్నాయి. అఫ్గానిస్థాన్‌లో శాంతి, శ్రేయస్సు, అభివృద్ధి గురించి విస్తృత చర్చలు జరిపాయి. ఈ నేపథ్యంలో ఓ ఉమ్మడి ప్రకటనను వెలువరించాయి. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం ప్రయోజనాలకు ప్రతికూలంగా కొన్ని దేశాలు తమ సైనిక మౌలిక సదుపాయాలను ఆఫ్ఘనిస్తాన్, పొరుగు దేశాలలో మోహరించే ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదని ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. అఫ్గానిస్థాన్, భారతదేశం, ఇరాన్, కజకిస్తాన్, చైనా, కిర్గిజిస్తాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల ప్రత్యేక ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు (Bagram airbase controversy).

అఫ్గాన్ రాజధాని కాబూల్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఈ బాగ్రామ్ ఎయిర్‌బేస్ ఉంది (India Taliban alliance). చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతానికి ఈ ఎయిర్‌బేస్ దగ్గరగా ఉంటుంది. జిన్జియాంగ్ ప్రాంతంలోనే చైనా అణు, సైనిక సౌకర్యాలను నిర్వహిస్తుంది. దీంతో బాగ్రామ్ ఎయిర్‌బేస్ నుంచి చైనాపై నిఘా పెట్టాలని అమెరికా భావిస్తోంది. అందుకు చైనా, రష్యా, పాకిస్థాన్, ఇరాన్ అంగీకరించడం లేదు. తాజాగా భారత్ కూడా అమెరికాకు వ్యతిరేకంగా గళం విప్పింది.

ఈ వార్తలు కూడా చదవండి..

పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 08 , 2025 | 01:50 PM