Piyush Goyal: ఒత్తిడికి తలొగ్గి ఎలాంటి డీల్స్ కుదుర్చుకోము: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
ABN, Publish Date - Oct 24 , 2025 | 10:59 PM
తొందరపాటుతో లేదా ఒత్తిడికి తలొగ్గి భారత్ ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమని పేర్కొన్నారు. జర్మనీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఒత్తిడికి తలొగ్గి లేదా తొందరపాటుతో భారత్ ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. జర్మనీలో బెర్లిన్ డయలాగ్ సమావేశంలో శుక్రవారం ఆయన ఈ కామెంట్స్ చేశారు. తన దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భారత్ వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటుందని అన్నారు (Piyush Goyal).
ప్రస్తుతం ఐరోపా సమాఖ్యతో పాటు అమెరికాతో కూడా చర్చలు జరుపుతున్నామని ఆయన అన్నారు. అయితే, తొందరపాటుగా ఎలాంటి డీల్స్ కుదుర్చుకోమని చెప్పారు. డెడ్‌లైన్స్ పెట్టి లేదా తలకు తుపాకీ గురిపెట్టి డీల్స్ కుదుర్చుకోవాలంటే కుదరదని తేల్చి చెప్పారు. వివిధ దేశాలతో కలిసి పని చేసేందుకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు. అయితే, జాతి ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు (India-US trade negotiations).
అమెరికా అధిక సుంకాల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు భారత్ ప్రత్యామ్నాయ మార్కెట్‌లను అన్వేషిస్తోందని మంత్రి గోయల్ తెలిపారు. వ్యూహాత్మక ఆలోచన, జాతీ ప్రయోజనాలే లక్ష్యంగా భారత్ ముందుకెళుతోందని అన్నారు. స్వీయ ప్రయోజనాల ఆధారంగానే భారత్ తన మిత్రులు ఎవరో నిర్ణయించుకుంటుందని అన్నారు. భారత్‌తో భాగస్వామ్యం పరస్పర గౌరవంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఎవరితో వాణిజ్యం నెరపాలో వద్దో భారత్‌కు ఇతర దేశాలు చెప్పజాలవని కూడా అన్నారు. రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేయాలంటూ భారత్‌పై అమెరికా ఒత్తిడి తెస్తోందన్న వార్తల నడుమ మంత్రి ఈ కామెంట్స్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి:
పాక్ తీరుపై ఐక్యరాజ్య సమితి మౌనం.. మంత్రి జైశంకర్ విమర్శలు
పాక్‌కు భారత్ తరహాలో బుద్ధి చెప్పేందుకు సిద్ధమైన అఫ్ఘానిస్థాన్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Oct 25 , 2025 | 12:03 AM