Modi Putin selfie: మోదీ-పుతిన్ సెల్ఫీ.. అమెరికాలో భయాందోళనలు.. ట్రంప్‌పై విమర్శలు..
ABN, Publish Date - Dec 12 , 2025 | 07:13 AM
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన అత్యంత స్నేహపూర్వకంగా సాగింది. పుతిన్ రెండ్రోజుల పర్యటనను ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తికరంగా గమనించాయి. చైనా వంటి దేశాలు పుతిన్ భారత పర్యటనను ఆహ్వానించాయి. అయితే ఆమెరికాలో మాత్రం ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్నాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన అత్యంత స్నేహపూర్వకంగా సాగింది. పుతిన్ రెండ్రోజుల పర్యటనను ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తికరంగా గమనించాయి. చైనా వంటి దేశాలు పుతిన్ భారత పర్యటనను ఆహ్వానించాయి. అయితే ఆమెరికాలో మాత్రం ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా మోదీ-పుతిన్ తీసుకున్న సెల్ఫీ అమెరికాలో బాగా వైరల్ అవుతోంది. ఈ సెల్ఫీ కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు ఎదుర్కొంటున్నారు (Modi Putin photo controversy).
పుతిన్ భారత్‌లో దిగగానే ప్రధాని మోదీ స్వయంగా ఆయనకు స్వాగతం పలికి ఒకే కారులో కలిసి ప్రయాణించారు. ఆ సమయంలో వారిద్దరూ కలిసి సెల్ఫీ తీసుకున్నారు. ఈ సెల్ఫీ అమెరికాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ట్రంప్ విధానాల కారణంగా అమెరికా వ్యూహాత్మక భాగస్వామి అయిన ఇండియా శత్రువుల చేతిలోకి వెళ్లిపోతోందంటూ అమెరికా చట్ట సభ సభ్యురాలు కమ్‌లాగర్ హెచ్చరించారు. ట్రంప్ విధానాలు ఇరు దేశాల మధ్య విశ్వాసం, పరస్పర అవగాహనను దెబ్బతీస్తున్నాయని విమర్శించారు (US Congress concerns).
అమెరికా వ్యవహార శైలి భారత్‌ను రష్యా వైపునకు నెట్టేస్తోందని అగ్రరాజ్య ప్రతిపక్ష సభ్యులు విమర్శిస్తున్నారు (India Russia relations). భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని, ఇండో-పసిఫిక్ పరిరక్షణకు భారత్ అవసరం ఎంతో ఉందని చట్ట సభకు చెందిన మరో సభ్యుడు హుయిజెంగా వ్యాఖ్యానించారు. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎగదోసే పాకిస్థాన్‌తో స్నేహ సంబంధాలు పెట్టుకోవడం తప్పిదమని అమెరికా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధ్రువ జైశంకర్ అన్నారు.
ఇవీ చదవండి:
వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీపై అధ్యక్షుడు ట్రంప్ పొగడ్తలు.. ఆమె సూపర్ స్టార్ అంటూ..
మన దేశానికి రష్యా అధ్యక్షులెవరూ ఇందుకే రారు.. పాక్ జర్నలిస్టు ఆవేదన
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 12 , 2025 | 07:13 AM