Helpline Numbers Nepal: నేపాల్లో పరిస్థితి ఉద్రిక్తం..భారతీయుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల
ABN, Publish Date - Sep 10 , 2025 | 10:31 AM
నేపాల్లో పరిస్థితి తీవ్రంగా మారింది. సోషల్ మీడియాపై నిషేధం వెనక్కి తీసుకున్నా యువత ఆందోళన మాత్రం మూడో రోజు కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్న భారతీయుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశాయి.
నేపాల్లో ప్రస్తుత పరిస్థితులు మరింత గందరగోళంగా (Nepal Protests) మారాయి. సోషల్ మీడియా సైట్స్‌లో 26 యాప్స్ (వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటివి) నిషేధించారు. ఈ నిర్ణయం అక్కడి యువతకు నచ్చలేదు. దీంతో యువత భారీగా రోడ్ల మీదకి వచ్చి జెన్ జడ్ పేరుతో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఈ నిరసనల్లో హింస జరిగి, ఇప్పటివరకు 20 మంది చనిపోయారు, 300 మందికి పైగా గాయపడ్డారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. దీంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం నిషేధం ఎత్తివేసినా కూడా నిరసనలు మాత్రం ఆగడం లేదు.
కాట్మండులో ప్రొటెస్టర్స్ పార్లమెంట్ బిల్డింగ్‌ని, మాజీ ప్రధాని, హోం మినిస్టర్ ఇళ్లను తగలబెట్టారు. ఈ గందరగోళంతో ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్, ఇండిగో వంటి ఎయిర్‌లైన్స్ కాట్మండుకు విమానాలు రద్దు చేశాయి. ట్రిబ్యూన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ని కూడా తాత్కాలికంగా మూసేశారు. ఈ గందరగోళంలో ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. ఇప్పుడు పరిస్థితి కాస్త నార్మలైజ్ అవ్వాలని ఆర్మీ ప్రయత్నిస్తోంది. నేపాల్ ఆర్మీ భద్రతా బాధ్యతలు తీసుకుని ప్రొటెస్టర్స్ చర్చలకు రావాలని పిలుస్తోంది. కానీ, ఇంకా అక్కడ టెన్షన్ వాతావరణమే ఉంది. ఆందోళనలు మూడో రోజు కూడా కొనసాగుతున్నాయి.
భారతీయుల కోసం..
ఈ నేపథ్యంలో నేపాల్లో ఉన్న భారతీయులకు సహాయం చేయడానికి భారత రాయబార కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వాలు హెల్ప్‌లైన్ నంబర్లు (Helpline Numbers for Indians ) ప్రకటించాయి. ఈ నంబర్లు మీకు లేదా మీ ఫ్రెండ్స్ నేపాల్లో ఉంటే వారికి ఉపయోగపడతాయి.
కాట్మండు భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్:
977-980 860 2881
977-981 032 6134
ఆంధ్రప్రదేశ్ వాళ్ల కోసం:
ఢిల్లీ ఏపీ భవన్ నంబర్లు: 98183 95787, 85000 27678
ఏపీఎన్‌ఆర్‌ఎస్ హెల్ప్‌లైన్: 0863 2340678
ఈమెయిల్ ఐడీలు: helpline@apnrts.com, info@apnrts.com
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హెల్ప్‌లైన్:
0522-2390257
0522-2724010
9454401674 (కాల్ లేదా వాట్సాప్)
యూపీలో స్పెషల్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. లక్నోలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాటు జరిగింది.
ఇండియా-నేపాల్ బోర్డర్ వద్ద పరిస్థితి
నేపాల్లో ఈ టెన్షన్ వల్ల ఇండియా-నేపాల్ బోర్డర్ వద్ద కూడా భద్రతను పెంచారు. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లోని సోనౌలి బోర్డర్ వద్ద నేపాల్ నుంచి వచ్చే వాళ్లను జాగ్రత్తగా చెక్ చేస్తున్నారు. మెడికల్ ఎమర్జెన్సీ లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉన్న నేపాలీలను మాత్రమే ఇండియాలోకి అనుమతిస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో, బోర్డర్ జిల్లాల్లో 24 గంటలూ పోలీసులు అలెర్ట్‌గా ఉన్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 10 , 2025 | 11:01 AM