ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trump Warns Hamas: నేను చెప్పినట్టు చేయకపోతే.. హమాస్‌కు డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ వార్నింగ్

ABN, Publish Date - Oct 05 , 2025 | 07:36 PM

శాంతి ఒప్పందం కుదుర్చునేందుకు డెడ్‌లైన్ సమీపిస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్‌కు చివరి వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదుర్చుకోకపోతే ఈ భూమ్మీద లేకుండా పోతారని వార్నింగ్ ఇచ్చారు.

Trump warns Hamas

ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు పాలస్తీనా ఉగ్ర సంస్థ హమాస్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువు మరి కొన్ని గంటల్లో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ హమాస్‌కు తుది హెచ్చరిక చేశారు. తాను సూచించినట్టు గాజాపై హమాస్ తన అధికారాన్ని వదులుకోకపోతే భూమ్మీద లేకుండా పోతుందని హెచ్చరించారు. గాజాపై దాడుల నిలిపివేతకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ సిద్ధంగానే ఉన్నారని అన్నారు. అమెరికా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లేందుకు ఆయన సిద్ధమేనని చెప్పారు. ఇక శాంతి స్థాపనకు హమాస్ నిజంగా సిద్ధంగా ఉందో లేదో త్వరలో తెలిసిపోతుందని కామెంట్ చేశారు (Trump warns Hamas of Obliteration).

ట్రంప్ శుక్రవారం నాడు హమాస్‌కు డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం 6 గంటల లోపు ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ అంగీకారానికి రావాలని సూచించారు. లేకపోతే హమాస్‌కు నరకం మొదలవుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈలోపు హమాస్‌కు మరో అవకాశం ఇవ్వదలుచుకున్నట్టు తెలిపారు. ఏదో మార్గంలో గాజాలో శాంతి నెలకొల్పడం తప్పదని స్పష్టం చేశారు. ఇక దాడుల విరమణకు తానూ సిద్ధమేనని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ కూడా తెలిపారు.

గాజాలో శాంతి స్థాపనకు ట్రంప్ 20 పాయింట్లతో కూడిన ప్రణాళికను ప్రకటించారు. ఈ ప్రణాళిక ప్రకారం, హమాస్ తన ఆయుధాలను పూర్తిస్థాయిలో త్యజించాల్సి ఉంటుంది. గాజాపై పాలనాధికారాలను పూర్తిగా వదులుకోవాల్సి ఉంటుంది. ఇక గాజాను ఇజ్రాయెల్ తన భూభాగంలో విలీనం చేసుకోదని కూడా ట్రంప్ పేర్కొన్నారు. ఈ ప్లాన్‌కు ఇజ్రాయెల్ అంగీకరించినా కూడా ఆయుధాలను వదులుకునేందుకు హమాస్ ముందుకు రావడంలేదు. ఇక గాజాపై అంతర్జాతీయ పర్యవేక్షణకు కూడా హమాస్ నో చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యలో తగ్గుదల.. దాదాపు సగానికి పడిపోయిన వైనం

హెచ్-1బీ వీసా పెంపునకు వ్యతిరేకంగా మొదలైన పోరాటం.. ఫెడరల్ కోర్టులో పిటిషన్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 05 , 2025 | 08:14 PM