ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Yunus funeral statement: భారత్ వ్యతిరేకి హాదీ అంత్యక్రియలకు యూనస్.. కీలక వ్యాఖ్యలు..

ABN, Publish Date - Dec 21 , 2025 | 06:06 PM

భారత్‌తో స్నేహం కొనసాగించిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను గద్దె దింపడం కోసం జరిగిన విద్యార్థుల ఉద్యమంలో హాదీ కీలక పాత్ర పోషించారు. భారత్‌కు వ్యతిరేకంగా పలుసార్లు వ్యాఖ్యలు చేశారు. ఈ నెల ఆరంభంలో పలువురు గుర్తు తెలియని వ్యక్తులు హాదీపై దాడి చేశారు.

Yunus political remark

భారత్ అంటే విద్వేషం కలిగిన ఇంకిలాబ్ మోంచో నేత షరీష్ ఉస్మాన్ హాదీ అంత్యక్రియలకు హాజరైన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హాదీ ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశం మర్చిపోలేని మంత్రాన్ని హాదీ అందరికీ అందించారని, అది ఎప్పటికీ తమ చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని యూనస్ అన్నారు (Yunus political remark).

'బంగ్లాదేశ్ ఉన్నంత కాలం ఉస్మాన్ హాదీ జీవించే ఉంటారు. నేను హాదీ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మాత్రమే రాలేదు. ఉస్మాన్ హాదీ.. మీరు మాకు చెప్పిన మాటను నెరవేరుస్తామని హామీ ఇస్తున్నా. మీరు దేశ ప్రజలందరి హృదయాల్లో ఉన్నారు. దేశ ప్రజలందరూ మీ ఆదర్శాలను కొనసాగిస్తారు. ప్రపంచం ముందు బంగ్లా తలెత్తుకుని ఉంటుంది. ఎవరి ముందూ తలవంచద'ని యూనస్ వేలాది ముందు యూనస్ ప్రసంగించారు (Anti-India Leader’s Funeral).

భారత్‌తో స్నేహం కొనసాగించిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను గద్దె దింపడం కోసం జరిగిన విద్యార్థుల ఉద్యమంలో హాదీ కీలక పాత్ర పోషించారు (viral funeral speech). భారత్‌కు వ్యతిరేకంగా పలుసార్లు వ్యాఖ్యలు చేశారు. ఈ నెల ఆరంభంలో పలువురు గుర్తు తెలియని వ్యక్తులు హాదీపై దాడి చేశారు. దీంతో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు తలెత్తాయి. శనివారం హాదీ అంత్యక్రియలు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జరిగాయి.

ఇవీ చదవండి:

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పరిమితంగా ట్రంప్ ప్రస్తావన.. విమర్శల వెల్లువ

కెనడా జనాభాలో తగ్గుదల.. 1946 తరువాత తొలిసారిగా..

Updated Date - Dec 21 , 2025 | 06:06 PM