Former Vice President: అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు చెనీ కన్నుమూత
ABN, Publish Date - Nov 05 , 2025 | 05:01 AM
అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు, రిపబ్లికన్ మాజీ నేత డిక్ చెనీ(84) కన్ను మూశారు. న్యుమోనియాతోపాటు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చెనీ.....
వాషింగ్టన్, నవంబరు 4: అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు, రిపబ్లికన్ మాజీ నేత డిక్ చెనీ(84) కన్ను మూశారు. న్యుమోనియాతోపాటు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చెనీ.. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన చెనీ.. బలమైన సంప్రదాయవాదిగా, అమెరికా చరిత్రలో శక్తివంతమైన ఉపాధ్యక్షుడిగా పేరు పొందారు. 9/11 ఉగ్రదాడులకు వ్యతిరేకంగా అమెరికా చేపట్టిన ‘వార్ ఆఫ్ టెర్రర్’కు ప్రధాన రూపకర్తగా చెనీకి గుర్తింపు ఉంది. 2003లో ఇరాక్‌పై అమెరికా దాడులు చేయడంలోనూ చెనీదే కీలకపాత్ర. కాగా, అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేయడం ద్వారా డిక్ చెనీ మరోసారి వార్తల్లోకెక్కారు. దేశానికి ట్రంప్ అతిపెద్ద ముప్పు అని, ప్రజలు ఆయనను తిరస్కరించినా హింస ద్వారా అధికారంలో కొనసాగాలని చూశారని చెనీ ఆరోపించారు. దీంతో రిపబ్లికన్ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు.
Updated Date - Nov 05 , 2025 | 05:01 AM