Zohran Mamdani JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ముస్లిం కాదు..
ABN, Publish Date - Oct 26 , 2025 | 08:34 PM
జొహ్రాన్ మమ్దానిపై జేడీ వాన్స్ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘జొహ్రాన్ చెబుతున్న దాని ప్రకారం 9/11 దాడుల బాధితురాలు అతడి ఆంటీనే. ఆమె ‘అంతగా బాగోదు’.. అని టాక్’ అని రాసుకొచ్చారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, జర్నలిస్ట్ మెహ్దీ హాసన్‌ల మధ్య సోషల్ మీడియా(JD Vance Mamdani Tweet) వేదికగా యుద్ధం నడుస్తోంది. జొహ్రాన్ ఆంటీపై వాన్స్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి దారి తీశాయి. రెండు రోజుల క్రితం జొహ్రాన్ మమ్దాని మీడియాతో మాట్లాడుతూ.. ‘9/11 దాడుల తర్వాత మా ఆంటీ చాలా భయపడిపోయింది. హిజాబ్ వేసుకుని న్యూయార్క్ సబ్‌వేలో ప్రయాణించటం సురక్షితం కాదని అనుకుంది. అప్పటినుంచి సబ్‌వే వైపు వెళ్లటమే మానేసింది’ అని చెప్పుకొచ్చాడు.
ఈ నేపథ్యంలోనే జొహ్రాన్ మమ్దానిపై (Laura Loomer Mehdi Hasan Clash) జేడీ వాన్స్ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘జొహ్రాన్ చెబుతున్న దాని ప్రకారం 9/11 దాడుల బాధితురాలు అతడి ఆంటీనే. ఆమె ‘అంతగా బాగోదు’.. అని టాక్’ అని రాసుకొచ్చారు. ఇదే సోషల్ మీడియాలో రచ్చకు దారి తీసింది. వాన్స్ వ్యాఖ్యలపై జర్నలిస్ట్ మెహ్దీ హాసన్ స్పందిస్తూ.. ‘గోధుమ రంగు శరీరం కలిగిన మహిళను పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని.. గోధుమ రంగు శరీరం కలిగిన మరో మహిళపై పబ్లిక్‌గా కామెంట్లు చేస్తున్నాడు. రేసిజం గురించి పబ్లిక్‌లో ఎమోషనల్‌గా మాట్లాడితే ఇలా అంటారా?.. వాన్స్ చాలా చెడ్డ వ్యక్తి’ అని అన్నాడు.
ఇక, మెహ్దీ హాసన్ వ్యాఖ్యలపై ఫార్ రైట్ యాక్టివిస్ట్ లారా లూమర్ స్పందించారు. ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘జేడీ వాన్స్ భార్య ముస్లిం కాదు. ఒక వేళ అతడి భార్య ముస్లిం అయి ఉంటే.. అతడు ఉపాధ్యక్షుడు అయ్యేవాడు కాదు. ఓ ముస్లిం వైట్ హౌస్‌లో ఉండటానికి మెగా(Problem With Islam MAGA) ఏమాత్రం ఒప్పుకోదు. మద్దతు కూడా ఇవ్వదు. హిందువులు, ముస్లింలు ఒకటే అని నువ్వు అనుకుంటున్నావా?’ అని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి
తీవ్ర విషాదం.. రైతు చేసిన పనికి 50 నెమళ్లు మృతి
వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారు?: సజ్జనార్
Updated Date - Oct 26 , 2025 | 08:42 PM