Tragedy in Tamil Nadu: తీవ్ర విషాదం.. రైతు చేసిన పనికి 50 నెమళ్లు మృతి
ABN , Publish Date - Oct 26 , 2025 | 08:20 PM
తమిళనాడులో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ రైతు చేసిన పనికి 50 నెమళ్లు మృతి చెందాయి. ఓ రైతు తన మొక్కజొన్న పంటను పక్షులు, జంతువుల నుంచి కాపాడేందుకు పొలం చుట్టూ ఆహార పదార్థాల్లో ఎలుకల మందుని కలిపి పెట్టారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 26: తమిళనాడులో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ రైతు చేసిన పనికి 50 నెమళ్లు మృతి చెందాయి. ఓ రైతు తన మొక్కజొన్న పంటను పక్షులు, జంతువుల నుంచి కాపాడేందుకు పొలం చుట్టూ ఆహార పదార్థాల్లో ఎలుకల మందుని కలిపి పెట్టారు. పొలం వద్దకు వచ్చిన నెమళ్ళు ఆ ఆహారం తిని మృత్యువాత పడ్డాయి. సుమారు 50 నెమళ్లు మృతి చెందాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనాస్థలిని పరిశీలించి సదరు రైతుని అరెస్టు చేశారు. తెన్‌కాశీ జిల్లాలోని మీనాక్షిపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Sajjanar: వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారు?: సజ్జనార్
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో 21 మంది మావోయిస్టుల లొంగుబాటు