Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో 21 మంది మావోయిస్టుల లొంగుబాటు
ABN , Publish Date - Oct 26 , 2025 | 07:38 PM
లొంగిపోయిన మావోయిస్టులు 18 ఆయుధాలను కూడా పోలీసులకు స్వాధీనం చేసినట్టు బస్తర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ పి.సుందర రాజ్ తెలిపారు. వీరంతా కుమారి/కిస్కోడో ప్రాంత కమిటీ కేష్కల్ డివిజన్ (నార్త్ సబ్ జోనల్ బ్యూరో)కు చెందిన వారని చెప్పారు.
నార్త్ బస్తర్ కాంకేర్: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో 21 మంది మావోయిస్టులు ఆదివారంనాడు లొంగిపోయారు. వీరిలో 13 మంది మహిళలు, 9 మంది పురుషులు ఉన్నారు. వీరిలో నలుగురు డీవీసీఎంలు, 9 మంది ఎసీఎంలు, 8 మంది పార్టీ సభ్యులు ఉన్నారు.
లొంగిపోయిన మావోయిస్టులు 18 ఆయుధాలను పోలీసులకు స్వాధీనం చేసినట్టు బస్తర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ పి.సుందర రాజ్ తెలిపారు. వీరంతా కుమారి/కిస్కోడో ప్రాంత కమిటీ కేష్కల్ డివిజన్ (నార్త్ సబ్ జోనల్ బ్యూరో)కు చెందిన వారని చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులు 3 ఏకే-47 రైఫిల్స్, 4 ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, 2 INSAS రైఫిల్స్, 6 పాయింట్ 303 రైఫిల్స్, 2 సింగిల్ షాట్ రైఫిల్స్, ఒక బీజీఎల్ వెపన్ స్వాధీనం చేసినట్టు వివరించారు.
రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించే క్రమంలో 21 మంది మావోయిస్టులు లొంగిపోవడం కీలక పరిణామమని, వారందరికీ పునరావాసం కల్పిస్తామని సుందర్‌రాజ్ చెప్పారు. తక్కిన మావోయిస్టు క్యాడెర్ కూడా శాంతి మార్గాన్ని ఎంచుకుని జనజీవన స్రవంతిలో కలవాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌ను 2026 మార్చి కల్లా నక్సల్స్ రహిత రాష్ట్రం చేయాలనే లక్ష్యంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
రూ.10 కోట్లు ఇవ్వకుంటే మీ కొడుకుని చంపేస్తాం.. బీజేపీ ఎంపీకి బెదిరింపు కాల్
సల్మాన్ ఖాన్ బలూచిస్థాన్ వ్యాఖ్యలపై ఆగ్రహం.. టెర్రరిస్ట్ అని ప్రకటించిన పాక్..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి