Salman Khan: సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలపై ఆగ్రహం.. టెర్రరిస్ట్ అని ప్రకటించిన పాక్..
ABN , Publish Date - Oct 26 , 2025 | 05:54 PM
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిని ఏకంగా ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. సల్మాన్‌ను పాక్ ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటిస్తూ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది.
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిని ఏకంగా ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. సల్మాన్‌ను పాక్ ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటిస్తూ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన 'జాయ్ ఫోరమ్ 2025' కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆ కార్యక్రమంలో పాకిస్థాన్‌ను, బలూచిస్థాన్‌ను సల్మాన్ వేరు చేసి మాట్లాడడమే ఆ దేశ ఆగ్రహానికి కారణం (Salman Balochistan comments).
ఆ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ మాట్లాడుతూ.. 'సౌదీ అరేబియాలో హిందీ సినిమాలు సూపర్‌హిట్ అవుతున్నాయి. తమిళం, తెలుగు, మలయాళం సినిమాలు కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇక్కడ పాకిస్థాన్ నుంచి, ఆఫ్గానిస్థాన్ నుంచి, బలూచిస్థాన్ నుంచి కూడా వచ్చిన వారు చాలా మంది ఉన్నారు' అని సల్మాన్ అన్నాడు. పాకిస్థాన్, బలూచిస్థాన్‌లను వేర్వేరుగా ప్రస్తావించడంతో పాక్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సల్మాన్ వ్యాఖ్యలను దేశ వ్యతిరేక చర్యగా పరిగణించిన పాక్ ప్రభుత్వం అతడు ఒక ఉగ్రవాది అని ముద్ర వేసింది (Pakistan terrorist list).
పాకిస్థాన్ ఉగ్రవాద నిరోధక చట్టం, 1997లోని 4వ షెడ్యూల్ కింద సల్మాన్ పేరును చేర్చింది (Bollywood controversy). ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు అనుమానించే వ్యక్తులు ఉండే బ్లాక్‌లిస్ట్‌లో సల్మాన్ పేరును చేర్చింది. ఇలా బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న వ్యక్తుల కదలికలపై పాక్ చట్టాల ప్రకారం నిఘా పెడతారు. వారిపై ఆంక్షలు విధిస్తారు. అవసరమైతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. అయితే సల్మాన్ వ్యాఖ్యలు బలూచిస్థాన్ వేర్పాటువాద నేతల్లో మాత్రం ఆనందాన్ని కలిగించాయి. బలూచిస్థాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న ప్రముఖ న్యాయవాది మీర్ యార్ బలూచ్.. సల్మాన్ చేసిన వ్యాఖ్యలు ఆరు కోట్ల ప్రజలకు ఆనందాన్ని కలిగించాయన్నారు.
ఇవి కూడా చదవండి..
shocking incident: వామ్మో.. కుక్కర్‌ను అలా ఓపెన్ చేస్తే పేలిపోతుందా? షాకింగ్ వీడియో వైరల్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..