shocking incident: వామ్మో.. కుక్కర్‌ను అలా ఓపెన్ చేస్తే పేలిపోతుందా? షాకింగ్ వీడియో వైరల్..
ABN , Publish Date - Oct 26 , 2025 | 03:18 PM
వంట గదిలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గ్యాస్ స్టవ్, ప్రెషర్ కుక్కర్ వంటివి వినియోగించే సమయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించకూడదు. ఏ మాత్రం తేడా వచ్చిన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే షాక్‌తో నివ్వెరపోక తప్పదు.
వంట గదిలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గ్యాస్ స్టవ్, ప్రెషర్ కుక్కర్ వంటివి వినియోగించే సమయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించకూడదు. ఏ మాత్రం తేడా వచ్చినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే షాక్‌తో నివ్వెరపోక తప్పదు. ఆ వీడియోలో ఒక మహిళ చేసిన పని వంట గదిలో భీకర ప్రమాదానికి కారణమైంది (kitchen accident).
net_ai_flix అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. టవల్ కట్టుకున్న ఓ మహిళ కిచెన్ రూమ్‌లోకి వచ్చింది. గ్యాస్ స్టవ్ మీద ఉంచిన కుక్కర్ నుంచి విజిల్ రప్పించేందుకు ప్రయత్నించింది. ఒక విజిల్ వచ్చిన తర్వాత దానిని తీసుకెళ్లి సింక్‌లోని ట్యాప్ వాటర్ కింద పెట్టింది. ఆ ప్రెషర్ కారణంగా ఆ కుక్కర్ పేలిపోయింది. పెద్ద విస్పోటనం సంభవించి ఆమె కింద పడిపోయింది. ఈ వీడియో చూసిన చాలా మంది షాకవుతున్నారు (cooker explosion story).
కొద్ది మంది ఆ వీడియోలోని మహిళ హావభావాలను, పొగను చూసి అది ఏఐ వీడియో అని చెబుతున్నారు (thriller short story). ఏదేమైనా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేల మంది ఆ వీడియోను చూసి తమ స్పందనలను తెలియజేశారు. ప్రెషర్ కుక్కర్‌తో ఆటలాడకూడదని ఒకరు కామెంట్ చేశారు. ఇప్పుడు ఏఐ కూడా కుక్కర్‌లను పేల్చేస్తోందని మరొకరు పేర్కొన్నారు. వంటగదిలో నిర్లక్ష్యంగా ఉండకూడదని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
పర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
పట్టాలపై కూర్చున్న పెద్దాయన.. దూసుకొచ్చిన రైలు.. చివరకు ఏమైందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి