Sanjay Jaiswal: రూ.10 కోట్లు ఇవ్వకుంటే మీ కొడుకుని చంపేస్తాం.. బీజేపీ ఎంపీకి బెదిరింపు కాల్
ABN , Publish Date - Oct 26 , 2025 | 04:57 PM
శుక్రవారం మధ్యాహ్నం కొద్దిపాటి వ్యవధిలోనే తనకు బెదిరింపు కాల్స్ వచ్చినట్టు సంజయ్ జైశ్వాల్ శనివారంనాడు ఫిర్యాదు చేశారని ఎస్‌డీపీఓ (బెట్టాయ్ టౌన్) వివేక్ దీప్ తెలిపారు. టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కాల్ చేసిన వ్యక్తిని ట్రాక్ చేస్తున్నట్టు చెప్పారు.
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ, లోక్‌సభలో ఆ పార్టీ చీఫ్ విప్ సంజయ్ జైశ్వాల్ (Sanjay Jaiswal)కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. రూ.10 కోట్ల ఇవ్వకుంటే ఆయన కుమారుడిని చంపేస్తామని అజ్ఞాత వ్యక్తులు బెదిరించినట్టు పోలీసులు తెలిపారు.
శుక్రవారం మధ్యాహ్నం కొద్దిపాటి వ్యవధిలోనే తనకు రెండు బెదిరింపు కాల్స్ వచ్చినట్టు సంజయ్ జైశ్వాల్ శనివారంనాడు ఫిర్యాదు చేశారని ఎస్‌డీపీఓ (బెట్టాయ్ టౌన్) వివేక్ దీప్ తెలిపారు. టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కాల్ చేసిన వ్యక్తిని ట్రాక్ చేస్తున్నట్టు చెప్పారు. కాల్ చేసిన వ్యక్తికి క్రిమినల్ ముఠాతో సంబంధం ఉన్నట్టు కనిపిస్తోందన్నారు. రాజకీయ వైరం ఉన్నట్టు ఎలాంటి సమాచారం లేదని, అయితే అన్ని కోణాల్లోంచి దర్యాప్తు జరుపుతున్నామని ఆయన తెలిపారు.
సంజయ్ జైశ్వాల్ బిహార్‌లోని పశ్చిమ చంపరాన్ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బిహార్ బీజేపీ చీఫ్‌గా కూడా ఆయన సేవలందించారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణ యోధుడు.. మన్‌కీ బాత్‌లో 'కొమురం భీం'ని కీర్తించిన ప్రధాని నరేంద్రమోదీ
నవంబర్‌లో పీఎం కిసాన్ నిధుల విడుదల..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి