PM Modi-Komaram Bheem: తెలంగాణ యోధుడు.. మన్‌కీ బాత్‌లో 'కొమురం భీం'ని కీర్తించిన ప్రధాని నరేంద్రమోదీ
ABN , Publish Date - Oct 26 , 2025 | 01:18 PM
ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఆదివారం దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించే మన్‌కీ బాత్ కార్యక్రమంలో కొమురం భీంను కీర్తించారు. 20వ శతాబ్దం తొలినాళ్లలో స్వాతంత్ర్యం సుదూరస్వప్నంగా ఉండేదన్న మోదీ..
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఆదివారం దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించే మన్‌కీ బాత్ కార్యక్రమంలో తెలంగాణ వీరుడు 'కొమురం భీం'ను కీర్తించారు. 20వ శతాబ్దం తొలినాళ్లలో దేశ ప్రజలకు స్వాతంత్ర్యం సుదూరస్వప్నంగా ఉండేదన్న మోదీ.. ఆ కాలంలో బ్రిటీష్‌వారి దోపిడీని గుర్తు చేశారు. అప్పట్లో తెలంగాణ, హైదరాబాద్ ప్రజలపై దమనకాండ తీవ్రంగా ఉండేదన్న మోదీ.. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయంపై, బ్రిటీషర్ల అకృత్యాలపై 20 ఏళ్ల వయసులో కొమురం భీం ఉద్యమించాడని మోదీ చెప్పారు.
నిజాం పోలీసు అధికారిని కొమురం భీం చంపడమే కాకుండా, అరెస్ట్ కాకుండా తప్పించుకోగలిగారని కీర్తించారు. అసంఖ్యాక ప్రజల హృదయాల్లో, ముఖ్యంగా ఆదివాసీల మనస్సుల్లో.. కొమురం భీం సుస్థిరస్థానం సంపాదించారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కొమురం భీం నుంచి యువత ఎంతో నేర్చుకోవాలని కూడా ప్రధాని మోదీ సూచించారు.
ఇవి కూడా చదవండి:
పాక్ తీరుపై ఐక్యరాజ్య సమితి మౌనం.. మంత్రి జైశంకర్ విమర్శలు
పాక్‌కు భారత్ తరహాలో బుద్ధి చెప్పేందుకు సిద్ధమైన అఫ్ఘానిస్థాన్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి